Homeఅంతర్జాతీయంPM Modi Meets Arab Leaders: మోదీ మ్యాజిక్‌.. శత్రు దేశాల మధ్య స్నేహ...

PM Modi Meets Arab Leaders: మోదీ మ్యాజిక్‌.. శత్రు దేశాల మధ్య స్నేహ బంధం.. 22 ముస్లిం దేశాలతో సదస్సు

PM Modi Meets Arab Leaders: ఏకకాలంలో పరస్పర శత్రువులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం, వ్యాపార వాణిజ్య బంధాలు కొనసాగించడం, ఇరు దేశాల నుంచి ప్రశంసలు పొందడం ఇటీవలి కాలంలో ఈ ఘనతను మన ప్రధాని నరేంద్రమోదీ సాధించారు. ఇటీవల మోదీ సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ ప్రశంసలు పొందారు. తర్వాత ఇరాన్‌ వెళ్లారు. ఇరాన్‌ మోదీకి ఏకంగా అత్యున్న పురస్కారం ప్రదానం చేసింది. రెండు దేశాలు నరేంద్రమోదీ, భారత్‌ గురించి గౌరవంగా మాట్లాడతాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా […]

PM Modi Meets Arab Leaders: ఏకకాలంలో పరస్పర శత్రువులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం, వ్యాపార వాణిజ్య బంధాలు కొనసాగించడం, ఇరు దేశాల నుంచి ప్రశంసలు పొందడం ఇటీవలి కాలంలో ఈ ఘనతను మన ప్రధాని నరేంద్రమోదీ సాధించారు. ఇటీవల మోదీ సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ ప్రశంసలు పొందారు. తర్వాత ఇరాన్‌ వెళ్లారు. ఇరాన్‌ మోదీకి ఏకంగా అత్యున్న పురస్కారం ప్రదానం చేసింది. రెండు దేశాలు నరేంద్రమోదీ, భారత్‌ గురించి గౌరవంగా మాట్లాడతాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా బద్ధ శత్రువులు, మోదీ ఇజ్రాయెల్‌ వెళ్లారు. అత్యున్నత పురస్కారం పొందారు. మోదీ మై ఫ్రెండ్‌ అని నెతన్యాహుతో అనిపించుకున్నారు. తర్వాత పాలస్తీనాకు వెళ్లారు. అక్కడి ప్రభుత్వ ప్రశంసలు పొందారు. అనేక వాణిజ్య ఒప్పందాలు చేసుకుని వచ్చారు. తాజాగా జవవరి 30న భారత్‌ దేశంలో కీలక సమావేశం జరిగింది. భారత అరబ్‌ దేశాలకు సంబంధించిన కీలక సమావేశం ఇంది. 22 ముస్లిం దేశాలకు చెందిన విదేశీ వ్యవహారాల మంత్రులు మన దేశంలో సమావేశం అయ్యారు. భారత్, యూఏఈ అధ్యక్షతన హైదరాబాద్‌ హౌస్‌లో ఈ భేటీ జరిగింది. ఇండో అరబ్‌ ఫారన్‌ మినిస్టర్స్‌ కాంక్లేవ్‌లో విదేశీ వ్యవహారాల మంత్రులు సెక్రెటరీలు పాల్గొన్నారు.

విభేదాల మధ్య ఐక్యత..
సౌదీ–యూఏఈ మధ్య యెమెన్‌లో టెన్షన్స్‌ (హూతీ దాడులు), ఇరాన్‌పై చాలా అరబ్‌ దేశాల వ్యతిరేకత. తుర్కీ, పాకిస్తాన్, సౌదీ ఇస్లామిక్‌ నాటో ఏర్పాటు చేస్తుంటే, గాజాలో ట్రంప్‌ చేతిలో ఇంటర్నేషనల్‌ స్టెబిలైజేషన్‌ ఫోర్స్‌ దింపే ప్రయత్నాలు. ఇటువంటి సమయంలో 22 దేశాల మంత్రులు, సెక్రెటరీలు భారత్‌లో సమావేశం కీలకంగా మారింది.

మోదీకి ప్రత్యేక ఆహ్వానాలు..
సదస్సు తర్వాత ఇజ్రాయెల్‌ మోదీకి ఆహ్వానం పంపింది. రక్షణ, ఆయుధ సహకారం భారత్‌తోనే పరిమితమని ప్రకటన చేసింది. ఇక పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సెన్‌ ఆగా బెకియాన్‌ షాహీన్‌ సదస్సుకు హాజరై గాజా పునర్నిర్మాణంలో భారత్‌ పాత్ర కోరారు. ‘భారత్‌ మాత్రమే ఇది చేయగలదు‘ అని ఆశాభావం. పాకిస్తాన్‌ను పక్కనపెట్టి భారత్‌పై విశ్వాసం ప్రకటించడం మోదీ విజయం.

కుళ్లుకుంటున్న పొరుగు దేశాలు..
ఈ సదస్సును చూసి మన పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కడుపు మండుతోంది. పాక్‌ గాజా ఫోర్స్‌లో చేరాలా లేదా అని సంకీర్ణంలో ఉంది. భారత్‌ 22 ముస్లిం దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడం, కీలకంగా మారింది. ఇది మోదీ డిప్లొమసీ శైలి. శత్రువుల మధ్య స్నేహం చిగురింపజేయడం పొరుగుదేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఈ సదస్సు వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తుంది. మధ్యప్రాచ్యంలో భారత్‌ ప్రభావం పెరుగుతుంది. భారత్‌ రాజకీయ బలాన్ని తెలియజేస్తోంది. మోదీ ఈ డైనమిక్‌ బ్యాలెన్స్‌తో భారత్‌ను గ్లోబల్‌ ఫోరంలో ముందుంచారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper