spot_img
Homeఅంతర్జాతీయంPakistani Student Thanks PM Modi: ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటకు తెచ్చిన మోడీకి పాకిస్తాన్...

Pakistani Student Thanks PM Modi: ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటకు తెచ్చిన మోడీకి పాకిస్తాన్ బాలిక థ్యాంక్స్.. వీడియో వైరల్

Pakistani Student Thanks PM Modi: ఉక్రెయిన్ పై రష్యా యుద్దం తర్వాత అక్కడ చిక్కుకుపోయిన విదేశీ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుజీవుడా అంటూ విద్యార్థులు ఉక్రెయిన్ సరిహద్దులకు వచ్చి తమను ఈ దేశం నుంచి తీసుకెళ్లాలని వేడుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Pakistani Student Thanks PM Modi
Pakistani Student Thanks PM Modi

భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ అనే పేరుతో మన దేశ విద్యార్థులను విమానాల ద్వారా దేశానికి తరలించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే పక్కనే ఉన్న పాకిస్తాన్ దేశం మాత్రం ఆ పని చేయలేకపోయింది. తమ దేశ విద్యార్థులను గాలికి వదిలేసిందన్న ఆరోపణలున్నాయి. స్వయంగా దీనిపై పాక్ విద్యార్థులు వీడియోల్లో వాపోయారు.

Also Read: CPI Narayana: నారాయణ.. నారాయణ.. ఏంటీ బూతు బాగోతం

ఈ క్రమంలోనే యుద్ధంతో రగులుతున్న ఉక్రెయిన్ నుంచి భారత్ సాయంతో బయటపడిన పాకిస్తాన్ బాలిక తాజాగా సంచలన వీడియో రిలీజ్ చేసింది. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Pakistani Student Thanks PM Modi
Pakistani Student Thanks PM Modi

పాకిస్తాన్ బాలిక ఆస్మా షఫీక్ తాజాగా ఆ వీడియోలో మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ లోని కీవ్ లో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, ప్రధాని నరేంద్రమోడీకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.చాలా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్న మాకు అన్ని విధాలుగా సాయం చేసిన కీవ్ లోని భారత రాయబార కార్యాలయానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా.. అలాగే భారత ప్రధానికి కూడా.. మేం సురక్షితంగా ఇంటికి చేరుకుంటామని ఆశిస్తున్నాం.. భారత రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు’ అంటూ వీడియోలో భారత్ గురించి గొప్పగా ఆస్మా పేర్కొంది.

Also Read: Krishnam Raju: షాకింగ్: ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు ప్రమాదం.. సర్జరీ.. వేలు తొలగింపు

ఆస్మా ఇప్పుడు భారత్ సాయంతో పశ్చిమ ఉక్రెయిన్ కు వెళుతోంది. అక్కడి నుంచి ఆమె బయటపడి స్వదేశానికి చేరుకుంటుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper