Homeఅంతర్జాతీయంPakistan Isolation: పాకిస్తాన్‌ దిగ్బంధనం.. ఏకమవుతున్న రెండు ఇస్తామిక్‌ దేశాలు!

Pakistan Isolation: పాకిస్తాన్‌ దిగ్బంధనం.. ఏకమవుతున్న రెండు ఇస్తామిక్‌ దేశాలు!

Pakistan Isolation: ప్రపంచ పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికాకు, ఇరాన్‌తో శాంతి కుదిర్చి.. తాము శాంతికాముకులమని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలని, గుర్తింపు తెచ్చుకోవాలని పాకిస్తాన్‌ భావిస్తోంది. చర్చలు ఇంకా జరగలేదు. ఇక తమది పవిత్ర దేశమని, తామే పవిత్రులం అని భావిస్తున్న పాకిస్తాన్‌ను ఇప్పుడు రెండు ముస్లిం దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇస్లామిక్‌ నాటో ఏర్పాటు చేసి ముస్లిం దేశాలపై పెత్తనం చెలాయించాలని పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ఇస్లామిక్‌ దేశాలే వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ ద్వంద్వ […]

Pakistan Isolation: ప్రపంచ పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికాకు, ఇరాన్‌తో శాంతి కుదిర్చి.. తాము శాంతికాముకులమని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలని, గుర్తింపు తెచ్చుకోవాలని పాకిస్తాన్‌ భావిస్తోంది. చర్చలు ఇంకా జరగలేదు. ఇక తమది పవిత్ర దేశమని, తామే పవిత్రులం అని భావిస్తున్న పాకిస్తాన్‌ను ఇప్పుడు రెండు ముస్లిం దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇస్లామిక్‌ నాటో ఏర్పాటు చేసి ముస్లిం దేశాలపై పెత్తనం చెలాయించాలని పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ఇస్లామిక్‌ దేశాలే వ్యతిరేకించడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ ద్వంద్వ విదేశాంగ విధానం పాకిస్తాన్‌ ప్రతిష్టను మరింత దిగజారుస్తోంది. ఇరాన్, ఆఫ్గానిస్తాన్‌ వ్యతిరేకత ప్రాంతీయ శక్తి సమతుల్యతకు కీలక మలుపు తీసుకొస్తోంది.

ఇస్లామిక్ నాటో ఆశయాలు
పాక్ సైన్య ముఖ్యత్వం అసిమ్ మునీర్ ‘డిఫెన్స్ డాక్ట్రిన్’లో ముస్లిం దేశాలకు ‘పెద్దభై’గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 8 ముస్లిం దేశాలు రక్షణ ఒప్పందాలకు ఆసక్తి చూపాయి; 2025-26లో 8 బిలియన్ డాలర్ల ఆయుధ ఎగుమతులు లక్ష్యం. అణ్వాయుధ రక్షణ హామీలతో ప్రభావం పెంచుకోవాలని చూస్తోంది.

ఉగ్రవాద సంస్థల తయారీ..
జెండ్‌అల్లా (2003), జైష్ ఎ ఆదిల్లను పాక్ ప్రోత్సహిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. 2003లో జెండ్‌అల్లా అనే ఉగ్రవాద గ్రూపును తయారుచేసి ఇరాన్‌ను చికాకు పెట్టింది. 2010 ఇరాన్‌ అమెరికా సహాయంతో జెండ్‌అల్లాను అంతం చేసింది. తర్వాత పాకిస్తాన్‌ మరో ఉగ్రవాద సంస్థను తయారు చేసింది. దానిపేరు జైష్‌ ఎ ఆదిల్‌. ఇది ఇరాన్‌లో ఉన్న సున్నీలకు న్యాయం చేస్తామని చెప్పుకుని పాకిస్తాన్‌లో ఉంటూ ఇరాన్‌పై దాడులు చేసింది. తాజాగా ఇరాన్‌లోని షీస్తాన్‌, బలూచిస్తాన్‌ రాష్ట్రాల్లో రాస్త్‌ జిల్లాలో ఇరాన్‌ భద్రతా దళాలు మూడు డజన‍్ల జైష్‌ ఎ ఆదిల్‌ ఉగ్రవాదులను హతమార్చాయి. ఇరాన్‌ వీళ్లను జైస్‌ ఎ జుల్‌ అని పిలుస్తుంది. మూడు డజన్ల మందిని హతమార్చిన విషయాన్ని ఇరాన్‌ రేడియో గర్వంగా ప్రకటించింది.

ఆఫ్గాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతలు
డ్యూరాండ్ లైన్ వివాదంతో 2025లో పరస్పర దాడులు జరిగాయి. పాక్ అన్ని సంబంధాలు కట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆఫ్గాన్‌ను ‘భారత ప్రాక్సీ’గా ఆరోపించింది. బలూచిస్తాన్‌లో సున్నీ ఉగ్రవాదానికి ఆఫ్గాన్ సైన్యం మద్దతు ఇస్తోందని పాక్ ఆరోపణలు ఉన్నాయి.మరోవైపు ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగాజీ ఆఫ్గానిస్తాన్‌ విదేశాంగ మంత్రి అమీర్‌ అలీ ఖాన్‌ ముత్తగీతో చర్చలు జరిపారు. అమెరికాతో శాంతి చర్చల సమయంలో పాకిస్తాన్‌ రెండు నాల్కల ధోరణి గురించి చర్చించారు. ఒకవైపు ఐఆర్‌జీసీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి.. ఇప్పుడు ఐఆర్‌జీసీని వ్యతిరేకించే సౌదీ అరేబియాకు 10 వేల మంది సైనికులను పంపింది. అదేవిధంగా డొనాల్డ్‌ ట్రంప్‌తో సన్నిహితంగా ఉంటుంది. దీంతో ఇరాన్‌ పాకిస్తాన్‌ను నమ్మడం లేదు. అమెరికా కూడా పాకిస్తాన్‌ను నమ్మడం లేదు. ఇదే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులను హతమార్చడంతోపాటు ఆఫ్గానిస్తాన్‌ విదేశాంగ మంత్రితో చర‍్చలు జరపడం చర్చనీయాంశంగా మారింది.

ఆఫ్గాన్‌లో తాలిబాన్లకు వ్యతిరేకంగా..
ఆఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లకు వ్యతిరేకంగా ఐఎస్‌కేపీ అనే సంస్థను పాకిసా‍్తన్‌ ప్రోత్సహిస్తుంది. డబ్బులు ఇస్తుంది. శిక్షణ ఇస్తుంది. జైష్‌ ఎ ఆదిల్‌ ఐఎస్‌కేపీ రెండూ పాకిస్తాన్‌కు చెందినవే కావడంతో ఇరాన్‌, ఆఫ్గానిస్తాన్‌ చర్చలు జరిపాయి. ఇది పాకిస్తాన్‌ను ఇబ్బంది పెట్టే పరిణామం. 2024, జనవరిలో జైష్‌ ఎ ఆదిల్‌ స్థావరాలపై ఇరాన్‌ వైమానిక దాడులు చేసింది. సర్జికల్‌ స్ట్రైక్‌ చేసింది. తర్వాత పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు చేసింది. ఆఫ్గానిస్తాన్‌పైన దాడులు చేసింది. ఆఫ్గానిస్తాన్‌ ప్రతిదాడులకు పాకిస్తాన్‌ సైనికులు చేతులు ఎత్తేశారు. ఆఫ్గానిస్తాన్‌ పాకిస్తాన్‌తో ఉన్న డ్యూరాండ్‌ లైన్‌ను గుర్తించదు. ఇరాన్‌ సరిహద్దును గుర్తిస్తుంది. పాకిస్తాన్‌ నుంచి ఉగ్రవాదులు రాకుండా 3 అడుగుల వెడల్పుతో 700 కిలోమీటర్ల గోడ నిర్మించింది. అక్కడక్కడ గేట్లు ఏర్పాటు చేసింది. చెక్‌పాయింట్లు పెట్టింది.

ఒంటరవుతున్న పాకిస్తాన్‌..
ఇప్పుడు ఇరాన్‌, ఆఫ్గానిస్తాన్‌ పాకిస్తాన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. భారత్‌ కూడా అనేక ఏళ్లుగా పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో పోరాడుతుంది. ఈ పోరాటంలో ఆఫ్గానిస్తా, ఇరాన్‌, భారత్‌ చేయి కలిపితే పాకిస్తాన్‌ ఒంటరి అవుతుంది. అందరి దృష్టి గల్‌‍‍్ఫపై ఉంది. పాకిస్తాన్‌ దిగ్బంధంపై ఎవరూ దృష్టి పెట్టలేదు. ఈ సమయంలో ఇరాన్‌, ఆఫ్గానిస్తాన్‌ దాడులు చేస్తే ఇప్పటికే ఆపరేషన్‌ సిందూర్‌తో తీవ్రంగా నష్టపోయిన పాకిస్తాన్‌ తుక్కుతుక్కు అవుతుంది. భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ 2.0 ప్రారంభిస్తే పాకిస్తాన్‌ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. గల్ఫ్‌లో శాంతికి ప్రయత్నిస్తుంది. కానీ రెండువైపులా ఆ దేశానికి ముప్పు పొంచి ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper