Middle East war impact Dubai tourism: మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం నెలకొంది. దీంతో అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. యుద్ధం వల్ల విపరీతంగా మిసైల్స్ దూసుకు వస్తున్నాయి. విమానాశ్రయాలు.. నౌకాశ్రయాలు.. జన సమర్థ ప్రాంతాలలో మిస్సయిల్స్ పడిపోతున్న నేపథ్యంలో నష్టం తీవ్రత అధికంగా ఉంది.
మిడిల్ ఈస్ట్ లో దుబాయ్ అనేది అత్యంత కీలకమైన ప్రాంతం. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్నారు. దుబాయ్ అనేది నిత్యం పర్యాటకులతో సందడిగా ఉంటుంది. విమానాశ్రయం అయితే నిత్యం రద్దీగా ఉంటుంది. అంతర్జాతీయ విమానాలతో ఆ ప్రాంతం మొత్తం జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. దుబాయ్ రియల్ ఎస్టేట్.. బంగారం.. రిసార్ట్.. బీచ్.. ఎడారులకు సుప్రసిద్ధి ప్రాంతం. అందువల్లే దుబాయ్ నగరంలో విహరించాలని.. ఆ ప్రాంతంలో సందడి చేయాలని చాలామంది అనుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రాంతాలలో దుబాయ్ ముందు వరుసలో ఉంటుందంటే.. అక్కడి టూరిస్ట్ డెస్టినేషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. దుబాయ్ వెళ్ళడానికి ఎవరూ సాహసం చేయడం లేదు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే విమానాలు ఖాళీగా ఉంటున్నాయి.. దుబాయ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే విమానాలు ప్రయాణికులతో రద్దీగానే ఉంటున్నాయి. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం అంతంతగానే ప్రయాణికులు కనిపిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఏమి రేట్స్ కంపెనీకి చెందిన విమానాలు ప్రయాణికులు లేకపోవడంతో.. ఆర్థికంగా విపరీతమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఖాళీగా వెళ్తున్న విమానాలలో సరుకులను తరలిస్తున్నాయి విమానయాన కంపెనీలు. సరుకు రవాణా ద్వారా కాస్తలో కాస్త నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటున్నదని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. సరుకు రవాణా ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ వనరు లభిస్తున్నదని విమానయన సంస్థలు వెల్లడిస్తున్నాయి.
“దుబాయ్ ఒకప్పుడు పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పుడు అక్కడ పరిస్థితి మారిపోయింది. విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకొని మిస్సైల్స్ దూసుకు వస్తున్నాయి. దీనివల్ల నష్టం విపరీతంగా ఉంటోంది. విమానాలు నడుస్తున్నప్పటికీ.. దుబాయ్ ప్రాంతాన్ని సందర్శించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో స్వర్గధామం కాస్త. . ఖాళీ ధామం అవుతోందని” విమానయాన సంస్థల సిబ్బంది చెబుతున్నారు.