Bangladesh Crisis : బంగ్లాదేశ్ లో నిన్నమొన్నటి వరకు జరిగిన అల్లర్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద కలవరాన్నే సృష్టించాయి. అసలు ఈ అల్లర్ల వెనుక చైనా ఉందని కొందరు, అమెరికా, బ్రిటన్ ఉన్నాయంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. ఏదేమైనా బంగ్లాలో ప్రస్తుత పరిస్థితుల వెనుక కొంతకాలంగా రహస్యంగా చేసిన కుట్ర ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. బంగ్లా పోరాటంలో అసువులు బాసిన కుటుంబాల సభ్యులకు రిజర్వేషన్ వర్తింపు నిర్ణయం తాజాగా తెరపైకి రావడం, వెనువెంటనే అల్లర్లు తీవ్రరూపం దాల్చడం వెనుక భారీ కుట్రకోణం దాగి ఉందని అనేక దేశాల మీడియా అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే భారత్ తో పాటు చైనాతోనూ ప్రధాని షేక్ హసీనా సన్నిహిత సంబంధాలనే కలిగి ఉన్నారు. ఈ క్రమంలో చైనా ఆదేశంలో అల్లర్లు రాజేస్తుందని అనుకోవడం పొరపాటే అవుతుందని మరికొందరు చెబుతున్నారు. మరి భారత్ ను ఇరుకున పెట్టాలని ప్రయత్నాలు మాత్రం ఆగలేదు. వీటన్నింటికీ భారత ప్రధాని మోదీ చెక్ పెడుతూ వచ్చారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికైన నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ ఈ అల్లర్ల వెనుక ఉన్నారని పలు వార్తలు వస్తున్నాయి. ఆయన బ్రిటన్, అమెరికా సహకారంతో షేక్ హసీనాపై ప్రతీకారం తీర్చుకున్నారని సమాచారం. గతంలో మహ్మద్ యూనస్ పై అనేక కేసులో ఆ దేశంలో ఉన్నాయి. ముఖ్యంగా మనీలాండరింగ్, ఛీటింగ్, ఫోర్జరీ కేసులు ఆయనపై ఉన్నాయి. దీంతో ఆయన లండన్ వెళ్లి, అక్కడి నుంచి చక్రం తిప్పారు. పాకిస్థాన్ కు చెందిన నిఘా సంస్థలతోనూ యూనస్ కు సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. యూనస్ సహకారంతో బంగ్లాలో అల్లర్లు రేపి, భారత్ కు వ్యతిరేకంగా మార్చాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే జార్జ్ సోరస్ అనే వ్యక్తిని రంగంలోకి దించినట్లు తెలుస్తున్నది.
ఈ జార్జ్ సోరస్ గతంలో పలుమార్లు ప్రధాని మోదీ, అదానీ గ్రూప్ నకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇక బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో ఈ సోరస్ న్యాయవ్యవస్థను మేనేజ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ సోరస్ ఆధ్వర్యంలో భారత్, బంగ్లా,తదితర దేశాల్లో స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందుతుంటాయి. ఈ క్రమంలోనే బంగ్లాలో పెద్ద ప్లాన్ నే వెనుక నుంచి నడిపించినట్లు తెలుస్తున్నది. అయితే షేక్ హసీనా ప్రభుత్వం 2018లో రద్దు చేసిన రిజర్వేషన్లను ఇప్పటికిప్పుడు అమల్లోకి తేవాలని ఢాకా హైకోర్టు తెరపైకి ఎందుకు తెచ్చిందో అర్థం కాక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో నే విద్యార్థుల ఆందోళనలు రేగాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇదంతా తెరవెనక బ్రిటన్, అమెరికా లండన్ లో ఉన్న యూనస్ సహకారంతో చేశాయని ప్రచారం జరుగుతున్నది.
ఇక అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనా దేశం విడవడం, యూనస్ బంగ్లాలో కి ఎంటర్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ ఆటలో భారత్ ను పావుగా వాడుకోవాలని పెద్ద ప్లాన్ జరిగినట్లుగా ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే హసీనాకు ఆశ్రయం విషయంలోనూ బ్రిటన్ భారత్ ను ఇరుకున పెట్టాలని చూసింది. కానీ ప్రధాని మోదీ వీటన్నింటికీ చెక్ పెట్టారు. ఆఖరికి బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్ దిగిరాలేక తప్పలేదు. భారత్ సహకారం తమకు అవసరమంటూ చివరకు యూనస్ ప్రకటన విడుదల చేశారు. భారత్ తెచ్చిన ఎనర్జీ చట్టం వల్లే ఇలా బంగ్లా ప్రధాని దిగివచ్చారని తెలుస్తున్నది. విద్యుత్ తో పాటు పెట్రోలియం తదితర ఉత్పత్తులు బంగ్లాకు వెళ్లకుండా వేసిన స్కెచ్ లో భాగంగా చివరకు బంగ్లా దిగివచ్చింది. బంగ్లా రాజకీయాలను భారత్ నిరంతరం పర్యవేక్షిస్తున్నది. ఆఖరికి ఆదానీ గ్రూప్ బంగ్లాకు విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించేలా చూశారు. ఏదేమైనా బంగ్లా అల్లర్ల వెనుక జరిగిన కుట్ర మాత్రం పెద్ద దేశాల పాత్ర ఉందనే ఇంకా బలంగానే ఉన్నాయి.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: It is known that yunus was behind the bangla riots and wanted to make india guilty
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com