India-Bangladesh tensions:1971 ప్రస్తుత బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్ గా ఉన్నప్పుడు అక్కడ పాకిస్తాన్ సైన్యం చేసిన దమనకాండకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు భారత సైన్యం వెళ్లి విముక్తి చేసింది. బంగ్లాదేశ్ గా అవతరించింది. అందరూ సంతోషించారు. కానీ తూర్పు సరిహద్దు దేశం మన మిత్రదేశంగా ఉండేది. 10 ఏళ్లుగా సంబంధాలు ఎంతో మెరుగుపడ్డాయి. రైలు, సముద్ర, కరెంట్ మనమే ఇస్తున్నాం.. ఇలా అన్ని రకాలుగా బంగ్లాదేశ్ కు భారత్ సహాయ సహకారాలు అందించింది.
2024 జూన్ లో విద్యార్థుల ఆందోళన పేరు మొదలైన అల్లర్లు.. జూలై వచ్చేసరికి ప్రధాని షేక్ హసీనా పారిపోయి భారత్ కు వచ్చి తలదాచుకునే పరిస్థితి వచ్చింది.
రోజురోజుకు బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ ప్రమేయం ఎక్కువవుతోంది. ఐఎస్ఐ సెల్ స్థాపించింది. రెగ్యులర్ సంప్రదింపులు సాగుతున్నాయి. కరాచీ , చిట్టగాంగ్ మధ్య సంబంధాలు పునరుద్దరించబడ్డాయి. పాక్, బంగ్లాదేశ్ లు మిత్రదేశాలుగా మారిపోయాయి.
కానీ బంగ్లాదేశ్ ను పాలిస్తున్న మహ్మద్ యూనస్ ఇటీవల నార్త్ ఈస్ట్ ఇండియా రాష్ట్రాలను మేం స్వాధీనం చేసుకుంటామని చైనాలో ప్రకటించారు. ఉగ్రవాదులను జైల్లో నుంచి బయటకు తీసుకువచ్చాడు. భారత్ వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాడు.
భారత్ కి వ్యతిరేక రాడికల్ ఇస్లామిక్ దేశంగా బాంగ్లాదేశ్.. బంగ్లాదేశ్ పరిణామాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.