Bangladesh Crisis: మన దేశానికి అతిపెద్ద శత్రువు పాకిస్తాన్.. ఆ దేశం నుంచే మనకు ముప్పు పొంచి ఉంది. సరిహద్దుల్లో పాకిస్తాన్ వెంటనే మన భద్రతా దళాలు నిత్యం గస్తి కాస్తుంటాయి. అయితే పాకిస్తాన్ నుంచి కాకుండా, మనకు ప్రధాన ముప్పు బంగ్లాదేశ్ నుంచి పొంచి ఉందని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది.. బంగ్లాదేశ్ లో విముక్తి యుద్ధం తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని.. అది భారతదేశానికి అతిపెద్ద ఇబ్బందిగా మారుతోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హెచ్చరించింది.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు శశిధరూర్ నేతృత్వంలోని ప్యానెల్ బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్నా రాజకీయ మార్పులు, చైనా, పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న రకరకాల ప్రభావాలు, పాకిస్తాన్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవి కోల్పోవడం.. ఈ పరిణామాలపై భారత జాగ్రత్తగా ఉండాలని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది. బంగ్లాదేశ్ విషయంలో భారత్ తన వ్యూహాన్ని మరోసారి సమీక్షించుకోవాలని సూచించింది.
“1971లో అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అవి ఒక కొత్త ఆవిర్భావానికి దారితీసాయి. ఇప్పుడు ఆ సవాల్ మరింత తీవ్రంగా మారింది.. తరాల మధ్య అంతరం ఏర్పడిన నేపథ్యంలో రాజకీయ వ్యవస్థలో మార్పు కావాల్సిందే. భారతదేశం ఇప్పుడు ఈ విషయాల గురించి ఆలోచించాలని” పార్లమెంటరీ కమిటీ సూచించింది. అంతేకాదు పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ సాగిస్తున్న సంబంధాలు, బంగ్లాదేశ్ లో చిన్న పెడుతున్న పెట్టుబడులు ఆందోళన కలిగిస్తున్నాయని పార్లమెంటరీ కమిటీ హెచ్చరించింది.. Mongla port, లాల్మో నిర్హాట్ ఎయిర్ బేస్, పెకువా జలాంతర్ గామే స్థావరం వంటి విషయాలను పార్లమెంటరీ కమిటీ ప్రముఖంగా ప్రస్తావించింది.
బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామి అనే సంస్థ బలంగా కూతలు ఉందని.. దీన్ని కూడా చైనా కలుపుకుపోతోందని.. తన స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి చైనా ముమ్మరంగా అడుగులు వేస్తోందని పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. డెవలప్మెంట్, కనెక్టివిటీ, పోర్ట్ ల అనుసంధానం వల్ల బంగ్లాదేశ్ ను చైనా నుంచి దూరం చేయవచ్చని పార్లమెంటరీ కమిటీ సూచించింది. బంగ్లాదేశ్ లో రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడుతున్నాయని, షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం వంటి పరిణామాలు బంగ్లాదేశ్లో ఏమైనా చేస్తాయని.. వచ్చే ఎన్నికల్లో అందరిని కలుపుకొని పోయే సామర్ధ్యాన్ని కలిగి ఉండాలని పేర్కొంది.