Chandrayaan 3: అమెరికా అగ్రరాజ్యం. అభివృద్ధిలో కొత్త శకాన్ని లిఖిస్తున్న రాజ్యం. భూమ్మీద మాత్రమే కాదు అంతరిక్షంలో అమెరికాది పెద్దన్న పాత్రే. ఇప్పటివరకు చంద్రుడి మీద కు ఎన్నో ఉపగ్రహాలు పంపింది. ఇంకా మరెన్నో ఉపగ్రహాలు పంపేందుకు ప్లాన్ చేస్తోంది. ఇవీ నిన్నా మొన్నటి వరకు ఉన్న ప్రచారంలో ఉన్న విషయాలు. అమెరికా చెప్పేవన్నీ అబద్ధాలేనా? జాబిల్లి మీద అమెరికా చేస్తున్నవన్నీ గప్పాలేనా? ఇన్నాళ్లు అమెరికా చెప్పిందంతా బూటకమేనా? అంటే దీనికి అవును అనే సమాధానాలే వస్తున్నాయి. చంద్రుడి మీద నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలు మోపాడు అని చెబుతున్న అమెరికా 1969 లో ఏం జరిగిందో ఎందుకు చెప్పడం లేదు? అపోలో_11 మిస్టరీని ఎందుకు బయట పెట్టడం లేదు? 1972 తర్వాత అమెరికా మూన్ మిషన్స్ ఎందుకు అర్ధంతరంగా నిలిపివేసింది. జాబిల్లిపై గ్రహాంతరవాసులు నిజంగానే ఉన్నారా? రష్యా_ అమెరికా మధ్య యుద్ధం పర్యవసనాలు ఏమిటి? ఇస్రో చంద్రయాన్ _3 నేపథ్యంలో.. అమెరికా దాచిన సత్యాలు మొత్తం బయటికి వస్తున్నాయి.
45 సంవత్సరాల ఆధిపత్యం
భూగోళం మీద రష్యా_ అమెరికా దేశాల మధ్య ఆధిపత్య పోరు 45 సంవత్సరాల పాటు సాగింది. 20వ శతాబ్దం చివరి దశకంలో యు ఎస్ ఎస్ ఆర్ కుప్పకూలింది.. క్రెమ్లిన్ భవనంపై స్వతంత్ర రష్యా జెండా ఎగరడంతో రెండు దేశాల మధ్య యుద్ధానికి తెరపడింది. అప్పటివరకు అణు పరీక్షలు చేస్తే అమెరికానే చేయాలి. రష్యా వార్సా కూటమి కడితే.. అమెరికా నాటో కూటమి కట్టాల్సిందే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అది మరో మలుపు తీసుకొని అంతరిక్ష యుద్ధానికి దారితీసింది. రష్యా స్పుత్నిక్ ను పంపిస్తే.. అమెరికా ఎక్స్ ప్లోరర్ ను స్పేస్ లోకి పంపింది. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. అంతరిక్ష పరిశోధనలో పోటీపడుతున్న రష్యాకు చెక్ పెట్టేందుకు అమెరికా సిగ్గూ శరం వదిలేసింది.. కట్టుకథలు చెప్పేంతవరకు వెళ్ళింది. “మేము చంద్రమండలం పైకి అడుగుపెట్టాం” అని ఫేక్ ప్రచారం అమెరికా చేసుకోవడం మొదలుపెట్టింది. నాసా చారిత్రక తప్పిదాన్ని అడ్డమైన లాజిక్ లతో సమర్ధించుకుంటూ శాస్త్ర ప్రపంచాన్నే కాదు, సభ్య సమాజాన్నీ మభ్యపెడుతూ అమెరికా తన దిగజారుడుతనాన్ని ఇంకా సవరించుకుంటూనే ఉంది. అయితే చంద్రయాన్_3 తర్వాత అమెరికా ఇప్పటివరకు ఏర్పరచుకున్న భ్రమల తాలూకు మేఘాలు మొత్తం విడిపోవడం మొదలయింది.
వాస్తవానికి మనిషి వేసిన ఒక చిన్న అడుగు, మానవాళి మొత్తానికి ఒక పెద్ద ముందడుగు అన్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కోట్ తో అమెరికా మూన్ మిషన్ చర్చలోకి వస్తుంది. పోటాపోటీగా సాగిన రష్యా_ అమెరికా సమరంలో స్పేస్ ప్రోగ్రాం పేరిట ఆడిన హైడ్రామా లో చంద్రుడిపై కాలుమోపిన మొట్టమొదటి వ్యక్తిగా అమెరికా నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ను మామూలుగా ప్రొజెక్టు చేయలేదు. అయితే, మూన్ లాండింగ్, నాసా, హాలీవుడ్ లు కలిసి సృష్టించిన కల్పిత ఉదంతమే. ఇది వాస్తవం కాదనేది కాన్స్పిరసి థియరిస్టుల ఉవాచ. రాకెట్ టెక్నాలజీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో అమెరికన్ వ్యోమగాములు చందమామపై కాలుమోపడం అసాధ్యం అనేది వాళ్ల వెర్షన్. అప్పటి ఆ ఫొటోలు, ఆ టెలి మెట్రి టేపులు, రేడియో, టీవీ ప్రసారాలు, చంద్ర గ్రహం పైనుంచి తెచ్చామని అమెరికా చెబుతున్న రాతి శఖలాలు అన్నీ అబద్దాలే అనేది శాస్త్ర ప్రపంచంలో ఓ వర్గం ఆరోపణ. గడచిన అర్థ శతాబ్దకాలంగా మనుగడలో ఉన్న కుట్రపూరిత మూన్ మిషన్ ను 20 శాతం పైగా అమెరికన్లు, 25 శాతం మంది బ్రిటన్లు, 30 శాతం మంది రష్యన్లు నమ్మడం లేదు. మేము టెక్నాలజీలో తోపు చెప్పుకునే అమెరికా చంద్రుడిపై ఇంతవరకు నీటి జాడలు కనుగోలేదు. ఇస్రో చంద్రయన్ ద్వారా చేసిన ప్రయోగం వాళ్లే ప్రపంచానికి చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయని తెలిసింది. ఈ ప్రయోగాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని నాసా ఎన్ని వేషాలు వేసిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. చంద్రుడి దక్షిణ ధృవం మీద భారత్ ప్రయోగించిన చంద్రయాన్_3 అన్వేషణ కొనసాగిస్తున్న నేపథ్యంలో అమెరికా నాసా చేస్తున్న కుయుక్తులు అన్ని ఇన్ని కావు. ఇదే సమయంలో అమెరికా గతంలో మూన్ మిషన్ ద్వారా ప్రపంచాన్ని ఎలా మోసం చేసింది అనేవి బయటికి వస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే చంద్రయాన్ _3 ప్రయోగం అమెరికా ఇజ్జత్ మొత్తం తీస్తోంది.