Pawan Kalyan OG Movie: పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్లకతప్పదంటున్నారు. ఈ మేరకు ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. 2019 చివర్లో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ప్రకటించారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలు విడుదల చేశారు. ఇవి మూడు రీమేక్ చిత్రాలు. పవన్ కళ్యాణ్ షార్ట్ పీరియడ్ లో పూర్తి చేశారు. బ్రో చిత్రానికైతే ఆయన కేవలం 20-25 రోజుల సమయం మాత్రమే కేటాయించారు. ఇక ఈ మూడు చిత్రాలు షూటింగ్స్ దాదాపు హైదరాబాద్ లోనే జరిగింది. మేజర్ పార్ట్ సెట్స్ లో పూర్తి చేశారు.
అయితే ఆయన మొదటిసారి విదేశాలకు వెళ్లక తప్పదంటున్నారు. దర్శకుడు సుజీత్ పాన్ ఇండియా చిత్రంగా ఓజీ తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అనేది క్యాప్షన్. పూర్తి మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షెడ్యూల్ థాయిలాండ్ లో ప్లాన్ చేస్తున్నారట. ఏకంగా 30 రోజులు పవన్ కళ్యాణ్ థాయిలాండ్ లో ఉండాల్సి వస్తుందని తాజా సమాచారం. థాయిలాండ్ లో భారీ యాక్షన్ సన్నివేశాలు, కొన్ని కీలక ఘట్టాలు తెరకెక్కించనున్నారట. అక్టోబర్ నెలలో ఈ షెడ్యూల్ సుజీత్ ప్లాన్ చేశారట.
స్క్రిప్ట్ డిమాండ్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ థాయిలాండ్ వెళ్లక తప్పదంటున్నారు. కమ్ బ్యాక్ అనంతరం మొదటిసారి షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్లనున్నారని వినికిడి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉండటం జరిగే పనేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆయన వారాహి యాత్ర గోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాలో మాత్రమే జరిగింది. ఇంకా చాలా ప్రాంతాల్లో వారాహి యాత్ర చేయాల్సి ఉంది.
ఈ క్రమంలో ఇది సాధ్యం అవుతుందా అంటున్నారు. కాగా ఓజీ రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారట. నాలుగైదు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. పవన్ కళ్యాణ్ ఎంట్రీనే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఉంటుందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ 7 నిముషాలు పాటు సాగుతుందట. పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఓజీ ఉంటుందని అంటున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ చిత్ర హీరోయిన్. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఓజీ టీజర్ విడుదల కానుంది.