Homeఅంతర్జాతీయంApollo 11 Mission: అమెరికా చంద్రుడు మీద అడుగు పెట్టలేదా? వాల్ట్ డిస్నీతో ఏమార్చిందా.. అసలు...

Apollo 11 Mission: అమెరికా చంద్రుడు మీద అడుగు పెట్టలేదా? వాల్ట్ డిస్నీతో ఏమార్చిందా.. అసలు వాస్తవాలివీ

Apollo 11 Mission: చంద్రుడి మీద యాత్ర అంటే అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా టెక్నాలజీ అభివృద్ధి చెందని రోజుల్లో అంత సులభం కాదు. మరి అలాంటి రోజుల్లో అమెరికాకు ఎలా సాధ్యమైంది? అమెరికా తన జెండాను చంద్రుడు మీద ఎలా పాత గలిగింది? ఈ ప్రశ్నలు అప్పుడు ఎవరూ వెయ్యలేదు. ఇప్పుడు వేయకుండా ఉండలేరు. కాకపోతే వీటికి అమెరికా ఏకపక్షంగానే సమాధానం చెబుతుంది. కానీ ఈ సమాధానాలు నాటకీయంగా చెప్పేందుకు.. జనాల బుర్రల్లో ఎక్కించేందుకు అమెరికా ఏకంగా వాల్ట్ డిస్నీ సహకారం తీసుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికీ నిజం.

వాల్ట్ డిస్నీ సౌజన్యంతో స్టాన్లీ
కుబ్రిక్ దర్శకత్వంలో ఆర్డర్ క్లార్క్ కథ ఆధారంగా ఒక రహస్య స్థావరంలో చంద్ర యాత్ర ఎపిసోడ్ ను నాసా కృత్రిమంగా రచించింది అనేది ఒక ఆరోపణ. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తో సహా అపోలో_11 లోని ఇతర వ్యోమగాములంతా కల్పిత పాత్రధారులే అనేది ఒక విమర్శ. వాళ్లందరినీ నాసా, కేప్ కెనర్వా ల్లోని ఒక లాంచ్ ప్యాడ్ పై ప్రయోగానికి సిద్ధంగా ఉన్న అపోలో_11 రాకెట్ లోకి లిఫ్ట్ ద్వారా ఎక్కించి, షూట్ అయిపోగానే దించేశారు అనేది గట్టి వాదన. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మానస ప్రయాణం పై విడుదలైన “కాప్రి కార్న్ వన్” అనే సినిమాలో అన్ని మూన్ లాండింగ్ దృశ్యాలే ఉన్నాయి అనేది విమర్శకుల ఆరోపణ. నాసా చెబుతున్న మూన్ ల్యాండింగ్ ఫేక్ అనడానికి ఇదే పెద్ద ప్రూఫ్ అని వారు అంటున్నారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తర్వాత 12 మంది అమెరికన్ వ్యోమగాములు వాక్ చేశారు అని చరిత్ర చెబుతోంది. కానీ అవన్నీ అమెరికా చెబుతున్న భూతకల్పనలని రష్యా తో సహా మిగిలిన ప్రపంచ దేశాలు వాదిస్తున్నాయి. దేశాలు దానికి బలమైన కారణాలే చూపుతున్నాయి.

నాసా అభూత కల్పనల్లో మండలం మీద అమెరికా జెండా ఎగరడం. అసలు వాతావరణమే లేనిచంద్రుడిపై గాలి ఎక్కడిది. జెండా ఎగరడం ఏంటి? అనేవి ప్రాథమిక ప్రశ్నలు. ఇక వాతావరణం లేకపోవడంతో చంద్రుని మీద నీలాకాశం అనేది ఉండదు. సూర్యకిరణాలు వాతావరణం ద్వారా చెల్లాచెదురుగా ప్రచురించడం వల్లే భూమి మీద ఆకాశం నీలిరంగులో కనిపిస్తుంది అనేది సైన్స్ చెబుతోంది. ఈ ప్రకారం జాబిల్లి పైన అంతరిక్షం నక్షత్రాలతో కూడి నలుపు రంగులోనే ఉంటుంది. నాసా మూన్ లాండింగ్ ఫోటోలో ఆ నలుగు రంగు ఆకాశంలో నక్షత్రాలు మిస్ అవ్వడం కూడా మరొక అనుమానం. ఇక చందమామపై మనుషులు ఇతర భౌతిక రాశుల నీడలో సారూప్యత లేకపోవడం మరొక పరిశీలన. ఆ భారీ సెట్టింగ్లో డిఫరెంట్ లైటింగ్ మధ్య మూన్ లాండింగ్ షూట్ జరగడమే అసహజమైన ఆ వ్యత్యాసానికి అసలు కారణమనేది మరొక ఆధారం. వేల చంద్రుడిపై కాలుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అయితే , మరి ఆయన లూనార్ మాడ్యుల్ నుంచి నిచ్చెన ద్వారా దిగుతుండగా ఫోటోలు ఎవరు తీశారు? ఎలా తీశారు? చంద్రుడి పై ఆ కెమెరా ఎక్కడిది? అన్నది మరొక వివాదాస్పద కోణం. సరే లూనార్ మాడ్యూల్ కు అమర్చిన కెమెరా ఫోటోలు తీసింది అనుకుంటే.. ఆనాడు స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ లో వాడిన ఆ ప్రిమిటివ్ కెమెరాలతో అంత స్పష్టమైన ఛాయాచిత్రాలు రావడం అసలు రావడం ఏంటనేది లాజిక్ లేని ప్రశ్న.

ఇక 1969 నుంచి 1972 వరకు ఆరుసార్లు చంద్రుడి మీదికి మనుషులను పంపామని బిల్డప్ ఇస్తున్న అమెరికా.. మళ్లీ చంద్రుడి మీదికి మనుషులను పంపలేదు. ఇది ఏంటని ప్రశ్నిస్తే అది ఖర్చుతో కూడిన ప్రయాస అని చెబుతూ వస్తోంది. అక్కడ గ్రహాంతర వాసులు ఉన్నారని బుకాయిస్తోంది. వాళ్లతో అపాయం పొంచి ఉందని అడ్డమైన కారణాన్ని తెరపైకి తెస్తోంది.. అదే నిజమైతే ఇప్పటికే వివిధ దేశాలు పంపిన మూన్ మిషన్స్ లో గ్రహాంతరవాసుల నిగ్గు ఇప్పటికే తేలేదే. ఇలా ఇన్ని అనుమానాల మధ్య నాసా ఇప్పటికీ నిస్సిగ్గుగా తాము చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకుంటూనే ఉంది. జనాన్ని నమ్మించేందుకు ఏవో అలవి కాని సైంటిఫిక్ కారణాలతో ఊదరగొడుతోంది. ఏది ఏమైనాప్పటికీ స్పేస్ సైన్స్ లో ఇప్పుడిప్పుడే తన సత్తా చాటుతున్న ఇండియా మూన్ మిషన్స్ ను చేపట్టిన ప్రపంచ దేశాల్లో ఐదవది. నాలుగేళ్ల క్రితం పంపిన చంద్రయాన్_2 విఫలమైనప్పటికీ పట్టుదలని విక్రమార్కుడి లాగా చంద్రయాన్_3ని పంపి ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. తాజాగా రష్యా పంపిన లూనా మిషన్ చంద్రుడిపై క్రాష్ ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే డి బూస్టింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన చంద్రయాన్ _3 లూనార్ మాడ్యూల్ చందమామపై సురక్షితంగా దిగి భారత ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular