Homeఅంతర్జాతీయంIran Crisis Reasons: ఇరాన్‌ దుస్థితికి ఆ నలుగురే కారణం!

Iran Crisis Reasons: ఇరాన్‌ దుస్థితికి ఆ నలుగురే కారణం!

Iran Crisis Reasons: దేశ అభివృద్ధి ఆ దేశ సంపదను సూచిస్తుంది. కానీ ఇరాన్‌ చూస్తే వెనుకబడే ఉంటుంది. కానీ సంపద లేదని కాదు. గల్ఫ్‌ రీజియన్‌లో ఎక్కువ ఆయిల్‌ నిల్వలు ఉన్నవి ఈ దేశంలోనే. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌ వంటి గల్ఫ్‌ దేశాలు ఆయిల్‌ ఉత్పత్తిలో ఇరాన్‌తో పోలిస్తే వెనుకబడినా, అభివృద్ధిలో ముందుండి ఉన్నాయి. ఏడాదికి వందల అంతస్తులు, ఆధునిక విమానాశ్రయాలు, పర్యాటక కేంద్రాలు నిర్మించి ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. వీటి ఆయిల్‌ ఆదాయాన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టూరిజం, డైవర్సిఫికేషన్‌లో పెట్టి, స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాయి. ఫలితంగా, ఈ దేశాలు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాల్లో ముందుండి, ప్రజల జీవన ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇరాన్‌ పతనానికి మూలం..
ఇరాన్‌ వద్ద గల్ఫ్‌ దేశాల కంటే ఎక్కువ ఆయిల్‌ నిల్వలు ఉన్నా, ఆర్థికంగా బాధలు పడుతోంది. కచ్చారోడ్లు, పేదరికం, అధిక ద్రవ్యోల్బణం కనిపించడం సాధారణం. ఆయిల్‌ ఆదాయం దేశ అభివృద్ధికి కాకుండా, విదేశీ ఉగ్ర సంస్థలకు వెచ్చవుతోంది. ప్రధాన కారణాలు..

ఆ నలుగురికే ఎక్కువ నిధులు..
ఇరాన్‌ తన సంపదలో ఎక్కువ మొత్తం దేశ అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణం మెరుగు కోసం ఖర్చు చేయడం లేదు. ఐఆర్‌జీసీ, హమాస్, హెజ్‌బొల్లా, హౌతీల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తోంది. వాటికి డబ్బుతోపాటు ఆయుధాలు అందిస్తోంది.

ఐఆర్‌జీసీ..
ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కార్ప్‌స్‌(ఐఆర్‌జీసీ)కు ఆయిల్‌ ఆదాయంలో భారీ భాగం పోతోంది. ఇది ఇరాన్‌ సైన్యం కాదు, సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖామెనీ ప్రైవేట్‌ సైన్యం. ఐఖఎఇ ఆయిల్‌ వ్యాపారాన్ని నియంత్రించి, దేశ ఆర్థిక వనరులను తమ ప్రభుత్వపై దాడులు, ప్రచారాలకు ఉపయోగిస్తోంది.

హమాస్‌..
పాలస్తీనాలోని హమాస్‌కు ఇరాన్‌ ఆయుధాలు, డబ్బులు సమకూరుస్తోంది. ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులకు ఈ మద్దతు కీలకం. హమాస్‌ దాడుల వల్ల ఇరాన్‌ మీద అంతర్జాతీయ ఆంక్షలు పెరిగి, ఆర్థిక నష్టం మరింత పెరిగింది.

హిజ్బుల్లా..
లెబనాన్‌లోని బెయిరూట్‌కు సమీపంలో హిజ్బుల్లాను ఇరాన్‌ పెంచుకుంటోంది. ఇజ్రాయెల్, ఇతర పొరుగు దేశాలపై దాడులకు ఆయుధాలు అందిస్తోంది. ఈ సంస్థ ఇరాన్‌ విదేశీ విధానానికి ముందుంజల్లో పోరాడుతూ, ఆయిల్‌ డబ్బును వృథా చేస్తోంది.

హౌతీలు..
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్‌ ఆర్థిక, సైనిక సహాయం అందిస్తోంది. సౌదీ అరేబియాపై రాకెట్‌ దాడులకు ఈ మద్దతు కారణం. ఈ చర్యలు గల్ఫ్‌ దేశాలతో ఘర్షణలు పెంచి, ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపరుస్తున్నాయి.

గల్ఫ్‌ దేశాలు ఆయిల్‌ ఆదాయాన్ని విమానాశ్రయాలు (ఖతార్‌ హమాద్, దుబాయ్‌ అంతర్జాతీయం), పర్యాటక కేంద్రాలు (అబుదాబీ లూవ్రే, దుబాయ్‌ బ్రజ్‌ ఖలీఫా), డైవర్సిఫైడ్‌ ఎకానమీలో పెట్టి ముందుండి ఉన్నాయి. ఇరాన్‌ మాత్రం ఆదాయాన్ని ఐఆర్‌జీసీ, హమాస్, హిజ్బుల్లా, హౌతీల వంటి ప్రాక్సీలకు వెచ్చించి, పేదరికం, ఆంక్షలు, ద్రవ్యోల్బణం (42%)తో బాధలు పడుతోంది. ఆయిల్‌ డబ్బును ప్రాక్సీ యుద్ధాలకు వాడితే దేశం పతనం అవుతుంది అనడానికి ఇరాన్‌ ఒక పాఠం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular