Homeఅంతర్జాతీయంElon Musk: శృంగార జీవితంపై సంచలన విషయాలు పంచుకున్న ఎలన్ మస్క్

Elon Musk: శృంగార జీవితంపై సంచలన విషయాలు పంచుకున్న ఎలన్ మస్క్

Elon Musk: టెస్లా కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ పై సెక్స్ ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గే భార్య నికోల్ షెనహాన్ తో మస్క్ కు వివాహేతర సంబంధం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై మస్క్ అందులో నిజం లేదని ఖండిస్తున్నారు. ఇదంతా వట్టి ప్రచారమేనని కొట్టిపారేస్తున్నారు. తనను అప్రదిష్ట పాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వాపోయారు. తనకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టుకొస్తాయో తెలియదని అన్నారు. కానీ తనకు ఆమెతో శారీరక సంబంధం మాత్రం లేదని చెబుతున్నారు. ఇదంతా ఓ కట్టుకథ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Elon Musk
Elon Musk

సెర్గీ నేను మంచి మిత్రులం. మేం కలిసింది కూడా ఎక్కువసార్లు కాదు రెండు సార్లు మాత్రమే. కానీ తనపై ఇలాంటి సెక్స్ ఆరోపణలు రావడం నిజంగా దురదృష్టమే అని వాపోతున్నారు. అంతర్జాతీయ సమాజంలో తన ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగుతున్న కుట్రలో ఓ భాగమే ఈ ఆరోపణలు అని తేల్చేశారు. మస్క్ కు నికోల్ కు ఉన్న సంబంధంతోనే వారిద్దరు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై కూడా మస్క్ వివరణ ఇస్తున్నారు. వారి విడాకులకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

Also Read: Rishi Sunak or Liz Truss రిషి సునక్, ట్రస్.. ముఖాముఖి లో ఎవరు గెలిచారు?

సామాజిక మాధ్యమాల్లో మస్క్, నికోల్ సంబంధాలపై రకరకాల వార్తలు ప్రసారం అవుతున్నాయి. దీంతో మస్క్ జీవితంపై ఓ మరక పడినట్లు అయింది. కానీ ఇదంతా వట్టిదేనని చెబుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మస్క్ వ్యక్తిగత ప్రతిష్ట దిగజారిపోయే ప్రమాదం ఉంది. దీనిపై సాధ్యమైనంత వరకు పోరాటం చేస్తానని మస్క్ చెబుతున్నారు. సెక్స్ కుంభకోణంపై ఎవరు మొదలు పెట్టారో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మస్క్ జీవితం మసకబారిపోతోంది.

Elon Musk
Elon Musk

ఈ నేపథ్యంలో సెర్గీతో ఓ విందులో పాల్గొన్న ఫొటోను మస్క్ పోస్టు చేశారు. కొద్ది రోజులుగా తాను సెక్స్ లో పాల్గొనడం లేదని చెబుతున్నారు. కేవలం సంచలనం కోసం వాల్ స్ట్రీట్ జర్నల్ తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని మండిపడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా తన వ్యక్తిగత జీవితంపై ఇలా తప్పుడు వార్తలు వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని చెబుతున్నాడు. తన గౌరవానికి భంగం కలిగించే వార్తలు ప్రసారం చేయడంలో వారికి ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి మస్క్ జీవితంపై ఓ నల్లని మచ్చ పడటంతో ఆయన కంగారు పడుతున్నారు.

Also Read:Mohan Babu- Chandrababu: హాట్ టాపిక్: చంద్రబాబుతో మోహన్ బాబు భేటి.? కథేంటి?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular