Homeఅంతర్జాతీయంIran plan to target Donald Trump: ట్రంప్‌ను లేపేయడానికి ఇరాన్‌ ఇంత పెద్ద ప్లాన్‌...

Iran plan to target Donald Trump: ట్రంప్‌ను లేపేయడానికి ఇరాన్‌ ఇంత పెద్ద ప్లాన్‌ చేసిందా?

Iran plan to target Donald Trump: ఇరాన్‌ అణు కార్యకలాపాలు ఆపడం లేదనే సాకుతో అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ మిడిల్‌ ఈస్ట్‌లో మంట పుట్టించాడు. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం ప్రకటించాడు. వార్‌ ప్రారంభమైన మొదటి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను మట్టుబెట్టాయి. ఇక రెండో రోజు నుంచి ఇరాన్‌ ఆట మొదలు పెట్టింది. సుప్రీం లీడర్‌ హత్యకు ప్రతీకారంగా గల్ప్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై వైమానిక దాడులు చేస్తోంది. గల్ఫ్‌ దేశాల్లోని ఆయిల్‌ సంస్థలు, వాటర్‌ ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. పది రోజులైనా యుద్ధం తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. ట్రంప్‌ హత్యకు ఇరాన్‌ పెద్ద ప్లాన్‌ వేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఇరాన్‌ రహస్య ఏజెంటు రోజుకొకరు పట్టుబడుతున్నారు. దీంతో ట్రంప్‌ భద్రతపై నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

నిఘా సమాచారం..
అమెరికా నిఘా వ్యవస్థ పట్టుబడిన ఏజెంట్ల వద్ద దొరికిన ఆధారాలు, రహస్య కోడ్‌లను డీకోడ్‌ చేసింది. ఇరాన్‌ నుంచి వచ్చిన రహస్య సందేశాలను గుర్తించింది. ఖమేనీ మరణానికి సంబంధించిన సమయంలో ఈ కమ్యూనికేషన్లు పెరిగాయి. వీటిని దాగి ఉన్న రహస్య ఏజెంట్లకు సూచనలుగా పరిగణిస్తున్నారు. ఇలాంటి ఆపరేషన్లు సాధారణంగా దీర్ఘకాలికంగా ప్రశాంతంగా ఉంచబడతాయి, కానీ ఇప్పుడు వాటిని ఉత్తేజపరచడం ప్రమాదకరం.

Also Read: ఇరాన్‌ భుజంపై తుపాకీ పెట్టి.. గల్ఫ్‌ను కాల్చేస్తోన్న ట్రంప్‌!

ట్రంపే టార్గెట్‌గా..
ఇరాన్‌ ఏజెంట్లు యాక్టివ్‌ అయితే, ఇరాన్‌ ప్రతికూల శక్తులపై ప్రతీకార చర్యలు చేపట్టవచ్చు. ఇది ఉగ్రవాద దాడులు, సైబర్‌ దాడులు లేదా రహస్య హత్యల రూపంలో ఉండవచ్చు. మధ్యప్రాచ్య భద్రతా సమతుల్యతను భంగపరచి, అంతర్జాతీయ ఉద్రిక్తతలను పెంచుతుంది. అమెరికా, మిత్రరాజ్యాలు ఇప్పటికే అలర్ట్‌లు జారీ చేశాయి.

ఇరాన్‌లో కీలక నాయకుడు ఖమేనీ హత్య తర్వాత బయటి ఏజెంట్లను ఉపయోగించడం వ్యూహాత్మకంగా తప్పు అనిపిస్తుంది. ఇది ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి శత్రువులపై దాడులకు దారితీస్తే, ప్రపంచ ఇంధన ధరలు ఊపందుకుని, ఆర్థిక అస్థిరతలు తలెత్తుతాయి. అయితే, ఈ సమాచారం ఇంకా ధ్రువీకరణ కాలేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular