Canada: రక్తాన్ని దానం చేయొచ్చు. వీర్యాన్ని కూడా దానం చేయవచ్చు. చివరికి అవయవాలను కూడా దానం చేయొచ్చు. కానీ మన వ్యర్ధాలను కూడా దానం చేయడం ఎక్కడైనా విన్నారా.. పేరులోనే వ్యర్థం ఉన్నప్పటికీ.. దానివల్ల ఉపయోగం ఏంటని అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదివేయండి..
ఉదయం లేవగానే మనం ముందుగా చేసే పని కాలకృత్యాలు తీర్చుకోవడం. మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత వ్యర్ధాలు శరీరంలో పేరుకు పోతాయి . ఆ వ్యర్ధాలను శరీరం బయటికి పంపిస్తుంది. చెమట, మూత్రం, మలం రూపంలో వ్యర్ధాలు బయటికి పోతుంటాయి.
ఆధునిక వైద్యశాస్త్రం లో మన వ్యర్ధాలపై కూడా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ప్రయోగాలలో వచ్చిన ఫలితాలు మన శరీర ఆరోగ్య స్థితిని వెల్లడిస్తాయి. ఆ వ్యర్ధాలలో వచ్చిన ఫలితాలు మనం ఏం తింటున్నామో చెబుతాయి. కొన్ని సందర్భాలలో కొంతమందికి ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ఇవి మందులకు లొంగవు.
ఇలాంటి ఇన్ఫెక్షన్సలు సోకిన వారికి వైద్యులు ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఆ సమయంలో ముల్లును ముల్లు తోనే తీయాలి అనే సామెతను అమల్లో పెడతారు.. ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తుల వ్యర్ధాలలో ఉన్న బ్యాక్టీరియాను.. ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వ్యక్తుల శరీరంలోకి పంపిస్తారు. తద్వారా వారి ఇన్ఫెక్షన్ లను ఈ బ్యాక్టీరియా ద్వారా తగ్గిస్తారు.
కెనడా దేశంలో ఓ వ్యక్తి తీవ్రమైన ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో వైద్యులు సరికొత్త విధానానికి తెరతీశారు. కెనడా దేశానికి చెందిన ఆరోగ్యవంతమైన యువకుడి మలాన్ని సేకరించి.. అందులో ఉన్న మంచి బ్యాక్టీరియాను ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వ్యక్తి పేగుల్లోకి ఎక్కించారు. తద్వారా అతడి జీర్ణవ్యవస్థలో బ్యాక్టీరియాను బ్యాలెన్స్ చేశారు. ఆ యువకుడు ఇలా తన మలాన్ని దానం చేయడం ద్వారా సుమారు 400 మంది ఇన్ఫెక్షన్లను వైద్యులు నయం చేయగలిగారు. ఇలా అతడు తన మలాన్ని విక్రయించడం ద్వారా దాదాపు 3.4 లక్షలు సంపాదించాడు.. మలంలో ఉన్న బ్యాక్టీరియాను faecal microbacteria transplantation ప్రక్రియ ద్వారా ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వ్యక్తుల పేగుల్లోకి ప్రవేశపెడతారు.. ఇలాంటి ఇన్ఫెక్షన్లను వైద్యులు clostridioides difficile అని పిలుస్తుంటారు.