Homeఅంతర్జాతీయంBangladesh Political Developments 2026: బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. యూనస్‌కు పొగబెడుతున్న బీఎన్‌పీ

Bangladesh Political Developments 2026: బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. యూనస్‌కు పొగబెడుతున్న బీఎన్‌పీ

Bangladesh Political Developments 2026: బంగ్లాదేశ్‌లో మహ్మద్‌ యూనస్‌ పాలన ముగిసింది. 18 నెలల తర్వాత ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ అఖండ మెజారిటీతో గెలిచింది. పార్టీ చీఫ్‌ తారీఖ్‌ రహ్మాన్‌ ప్రధానిబాధ్యతలు చేపట్టారు. దీంతో మహ్మద్‌ యూనస్‌ పాలన ముగిసింది. 18 నెలలు అధికారం చెలాయించిన యూనస్‌ ఇప్పటికీ తన ప్రభావం ఉండాలని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలాంటి అధికారం లేకుండా ఉండాలనుకుంటున్నాడు. కానీ వెళ్లిపోవాల్సిందే అని బీఎన్‌పీ స్పష్టం చేసింది. […]

Bangladesh Political Developments 2026: బంగ్లాదేశ్‌లో మహ్మద్‌ యూనస్‌ పాలన ముగిసింది. 18 నెలల తర్వాత ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ అఖండ మెజారిటీతో గెలిచింది. పార్టీ చీఫ్‌ తారీఖ్‌ రహ్మాన్‌ ప్రధానిబాధ్యతలు చేపట్టారు. దీంతో మహ్మద్‌ యూనస్‌ పాలన ముగిసింది. 18 నెలలు అధికారం చెలాయించిన యూనస్‌ ఇప్పటికీ తన ప్రభావం ఉండాలని కోరుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలాంటి అధికారం లేకుండా ఉండాలనుకుంటున్నాడు. కానీ వెళ్లిపోవాల్సిందే అని బీఎన్‌పీ స్పష్టం చేసింది.

ఎన్నికల నేపథ్యం
ఎన్నికలు రెండు అంశాలపై జరిగాయి. ఒకటి ఏ పార్టీ కావాలని, రెండోది జూలై చార్టర్‌ కావాలా వద్దా అని ఓటు వేశారు. ప్రస్తుత ప్రభుత్వం 70 నుంచి 80 సంస్కరణలు తీసుకురాబోతున్నామని, 30 కొత్త చట్టాలు, చట్టసభ సమావేశాలతో యూనస్‌ ప్రభావం తగ్గించాలని బీఎన్‌పీ వ్యూహం. ఎంపీల పదవీ స్వీకార ప్రమాణంలో రోజే యూనస్‌ను పంపే ప్రక్రియ మొదలైంది.

భారత్‌ విషయంలోనూ సానుకూలంగా..
తారీఖ్‌ రహ్మాన్‌ యూనస్‌కు భిన్నంగా భారత్‌తో సానుకూలంగా ఉన్నారు. భారత స్పీకర్‌ ఓం బిర్లాతో చర్చించారు. బంగ్లాదేశ్‌ డిప్లమాట్‌తోనూ ఓం బిర్లా చర్చించారు. ఓం బిర్లా తారీఖ్‌ రహ్మాన్‌ను భారత్‌కు ఆహ్వానించారు. ఇందుకు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించారు. తారీఖ్‌ లక్ష్యమ జమాతే ఇస్తామి బంగ్లాదేశ్‌ను దెబ్బతీయడం. అందుకే భారత్‌కు రావడానికి అంగీకరించారు.

యూనస్‌ పరిస్థితి..
ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికారం నిలబెట్టుకోవాలని యూనస్‌ ప్రయత్నాలు వృథా అయ్యాయి. బీఎన్‌పీ స్పష్టంగా ‘సేవలు చాలు‘ అని సూచించింది. ఇది బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కుటుంబ తగాదా తీరుగా మారింది. బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ చీఫ్‌ అయిన తారీఖ ఉర్‌ రహ్మాన్‌ భారత్‌కు అనుకూలంగా కనిపిస్తున్నారు. జమాతే పార్టీకన్నా హసీనా వాజెద్‌ ఉండాలని తారీఖ్‌ రహ్మాన్‌ భావిస్తున్నారు. దీంతో పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా మారుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper