Homeఅంతర్జాతీయంQamar Javed Bajwa Injured: బాత్రూంలో జారిపడ్డ పాక్ మాజీ ఆర్మీ చీఫ్.. దీని వెనుక...

Qamar Javed Bajwa Injured: బాత్రూంలో జారిపడ్డ పాక్ మాజీ ఆర్మీ చీఫ్.. దీని వెనుక పెద్ద కథ!

Qamar Javed Bajwa Injured: పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభంతోపాటు రాజకీయ సంక్షోభం కూడా నిరంతరం కొనసాగుతుంది. స్థిరమైన పాలన ఉండదు. సైన్యానిదే ఆధిపత్యం ఉంటుంది. ప్రధానులు కీలుబొమ్మలు మాత్రమే. ప్రస్తుత ఆర్మీచీఫ్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆయన చెప్పినట్లు వింటున్నాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ మాజీ ఆర్మీచీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బాజ్వా కోమాలోకి వెళ్లారు. బాత్‌రూంలో జారి పడడంతో తలకు మూడుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కోమాలోకి వెళ్లాడు. బ్రెయిన్‌కు సర్జరీ చేశారు. పాకిస్తాన్‌ […]

Qamar Javed Bajwa Injured: పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభంతోపాటు రాజకీయ సంక్షోభం కూడా నిరంతరం కొనసాగుతుంది. స్థిరమైన పాలన ఉండదు. సైన్యానిదే ఆధిపత్యం ఉంటుంది. ప్రధానులు కీలుబొమ్మలు మాత్రమే. ప్రస్తుత ఆర్మీచీఫ్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఆయన చెప్పినట్లు వింటున్నాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ మాజీ ఆర్మీచీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బాజ్వా కోమాలోకి వెళ్లారు. బాత్‌రూంలో జారి పడడంతో తలకు మూడుచోట్ల గాయాలయ్యాయి. దీంతో కోమాలోకి వెళ్లాడు. బ్రెయిన్‌కు సర్జరీ చేశారు. పాకిస్తాన్‌ మాజీ ఆర్మీచీఫ్‌ గాయపడితే పెద్ద వార్త ఎందుకు అయింది. ఎందుకంటే.. ఖమర్‌ జావేద్‌ బాజ్వా తొమ్మిది రోజుల క్రితం బాత్‌రూంలో జారిఫడితే.. పాకిస్తాన్‌లోని ఐఎస్‌పీఆర్‌ 8 రోజుల తర్వాత ఒక ప్రకటన వెలువరించింది. ఈ విషయాన్ని ఎనిమిది రోజులు దీనిని దాచిపెట్టింది.

మనకెందుకు వర్రీ..
ఇక మనం ఎందుకు వర్రీ కావాలి అంటే.. పాకిస్తాన్‌ను పాలించేది ఆర్మీ. ప్రధాని కీలుబొమ్మ మాత్రమే. అందుకే ఆర్మీచీఫ్‌కు, మాజీ ఆర్మీ చీఫ్‌లకు ఏమైనా జరిగితే ప్రధాన్యం ఉంటుంది. ఎనిమిది రోజులు దాచడానికి ఆసిమ్‌ మునీర్‌కు ఖమర్‌ జావేద్‌ బాజ్వాకు ఉన్న విభేదాలే కారణం.

ఇమ్రాన్‌ఖాన్‌కు సన్నిహితుడు..
ఖమర్‌ జావేద్‌ బాజ్వా ఇమ్రాన్‌ఖాన్‌కు సన్నిహితంగా ఉన్నారు. లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఫయీజ్‌ హీద్‌ను ఆర్మీచీఫ్‌ చేయడానికి ప్రయత్నించారు. కానీ తర్వాత కుదరలేదు. ఆసిమ్‌ మునీర్‌ ఆర్మీచీఫ్‌ అయ్యాడు. ఇష్టంలేకపోయినా ఇమ్రాన్‌ఖాన్‌ ఆసిమ్‌ మునీర్‌ను చేయాల్సి వచ్చింది. దీనికి బలం చేకూరుస్తూ ఖాజా ఆసిఫ్‌ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆసిమ్‌ మునీర్‌ ఆర్మీ చీఫ్‌ కాకుండా ఖమర్‌ జావేద్‌ బాజ్వా అడ్డుకున్నట్లు తెలిపారు.

ఆర్మీ చీఫ్‌ కోసం పోటీ…
ఫయాజ్‌ హమీద్‌కు, ఆసిమ్‌ మునీర్‌కు మధ్య ఆర్మీ చీఫ్‌ పదవి కోసం పోటీ జరిగింది. ఆసిమ్‌ మునీర్‌ ఆర్మీ చీఫ్‌ కాగానే ఫయాజ్‌ హమీద్‌ను జైల్లో పెట్టారు. 2023లో ఆర్మీపై పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఎ ఇన్సాక్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఫాయిజ్‌ అహ్మద్, ఇమ్రాన్‌ఖాన్‌ దాడులను చూసీ చూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణతో కేసులు పెట్టారు. తర్వాత ఇమ్రాన్‌కాన్‌ను తప్పించి షెహబాజ్‌ షరీఫ్‌ను ప్రధానిని చేశారు.

శత్రుశేషం తొలగించడానికే..
శత్రుశేషం ఉండకూడదనే ఖమర్‌ జావేద్‌ను తిప్పంచే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాత్‌రూంలో పడిపోయినట్లు సీన్‌ క్రియేట్‌ చేసినట్లు తెలుస్తోంది. తలకు మూడు చోట్ల గాయాలు కావడానికి దాడి జరిగిందని సమాచారం. ఎనిమిది రోజులు వార్తను దాచి 9వ రోజు హడావుడి ప్రకటన చేసింది. ఆయన కోలుకుంటున్నట్లు తెలిపింది. కుమారులను గుర్తుపట్టిందని వెల్లడించింది.

మొత్తానికి ఆర్మీలో వర్గాలు ఉండడం, ఆధిపత్య పోరు ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక తంతర్గత సమస్యలను పక్కదారి పట్టించేందకు భారత్‌పై దాడి చేస్తుంది. ఈ క్రమంలో భారత సరిహద్దు గ్రామాల ప్రజలను తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో భారత్‌పై దాడి చేసే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper