Homeఅంతర్జాతీయంUndavalli Arun Kumar : అట్లాంటాలో కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్‌కు ఘన వీడ్కోలు

Undavalli Arun Kumar : అట్లాంటాలో కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్‌కు ఘన వీడ్కోలు

Undavalli Arun Kumar : అట్లాంటా: భారత కాన్సుల్ జనరల్‌గా అట్లాంటాలో సేవలందించిన శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్‌కు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. అట్లాంటా తెలుగు సమాజంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని, ముఖ్యంగా తెలుగువారికి అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా ఈవీపీ శ్రీనివాస్ లావు, తానా పూర్వ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తామా అధ్యక్షురాలు […]

Undavalli Arun Kumar : అట్లాంటా: భారత కాన్సుల్ జనరల్‌గా అట్లాంటాలో సేవలందించిన శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్‌కు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. అట్లాంటా తెలుగు సమాజంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని, ముఖ్యంగా తెలుగువారికి అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.

తానా ఈవీపీ శ్రీనివాస్ లావు, తానా పూర్వ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తామా అధ్యక్షురాలు సునీత పొట్నూరి, తానా ఫౌండేషన్ ట్రస్టీ, తామా ఛైర్మన్ మధుకర్ యార్లగడ్డ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రమేష్ బాబు లక్ష్మణన్ మాట్లాడుతూ.. అట్లాంటాలో తన మూడేళ్ల పదవీకాలంలో భారతీయ సమాజంతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కమ్యూనిటీ నుంచి లభించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.

తానా పూర్వ అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్న ‘టీమ్ స్క్వేర్’ సేవలను ప్రస్తావించారు. అమెరికాలోని భారత కాన్సులేట్లతో టీమ్ స్క్వేర్ వాలంటీర్లు నిరంతరం సమన్వయం చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులోనూ కాన్సులేట్ అధికారుల సహకారం కొనసాగాలని కోరారు.

తామా ఛైర్మన్ మధుకర్ యార్లగడ్డ మాట్లాడుతూ టీమ్ స్క్వేర్ అవసరాలకు తక్షణమే స్పందించిన కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రతినిధి మిని నాయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తామా అధ్యక్షురాలు సునీత పొట్నూరి మాట్లాడుతూ తామా క్లినిక్ ల్యాబ్ సేవల ప్రారంభంతో పాటు రక్తదాన శిబిరాల నిర్వహణలో రమేష్ బాబు చూపిన చొరవను గుర్తుచేశారు.

అనంతరం శ్రీనివాస్ లావు, శేఖర్ కొల్లు రమేష్ బాబు లక్ష్మణన్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి అట్లాంటాలోని తెలుగు సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.

కార్యక్రమంలో వాణి గడ్డం యాంకరింగ్ నిర్వహించగా, ప్రవీణ్ పురం, సెలబ్రేషన్స్ బాంక్వెట్ హాల్ నిర్వాహకులు వేదిక ఏర్పాట్లలో సహకరించారు. నారాయణ పల్లా డీజే బాధ్యతలు చేపట్టారు. రాగ వాహిని బృందానికి చెందిన ప్రియ మాధవ్, సందీప్ కోవెల, శరత్ రమేష్ సంగీత కార్యక్రమాలతో అలరించారు. భీమాస్ పాకశాల, రెడ్ చిల్లీస్ భోజన ఏర్పాట్లు చేయగా, సురేష్ కె. వోలా ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వహించారు.

అట్లాంటా తెలుగు సమాజం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం కేవలం వీడ్కోలు సభగానే కాకుండా, సమష్టి కృషి, పరస్పర సహకారానికి నిదర్శనంగా నిలిచింది. రమేష్ బాబు లక్ష్మణన్ దంపతులకు తానా, తామా ప్రతినిధులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper