Homeఅంతర్జాతీయంAnthropic leaving America: అమెరికాను వీడిన ఆంథ్రోపిక్‌.. కారణం ఆ డీల్‌కు అంగీకరించకపోవడమే!

Anthropic leaving America: అమెరికాను వీడిన ఆంథ్రోపిక్‌.. కారణం ఆ డీల్‌కు అంగీకరించకపోవడమే!

Anthropic leaving America: ప్రపంచంలో అంత్యం శక్తివంతమైన ఆయుధ సంపత్తి, టెక్నాలజీ ఉన్న దేశం అమెరికా. ఇటీవల వెనెజువెలాపై సైలెంట్‌గా జరిపిన ఆపరేషనే ఇందుకు నిదర్శనం. వెనెజువెలా టెక్నాలజీకి, రాడారలకు చిక్కకుండా యుద్ధ విమానాలు ఆ దేశంలో ల్యాండ్‌ అవడమే కాకుండా అధ్యక్షుడు, ఆయన భార్యను కిడ్నాప్‌ చేశారు. సైనిక శక్తిని మరింత ఆధునికీకరించేందకు ట్రంప్‌ సర్కార్‌ ఇటీవల ఏఐ యాక్సెస్‌ కోరింది. ఆంథ్రోపిక్‌ క్లాడ్‌ మోడల్స్‌ను సైనిక అవసరాలకు పూర్తి స్వేచ్ఛగా ఉపయోగించాలని డిమాండ్‌ చేసింది. […]

Anthropic leaving America: ప్రపంచంలో అంత్యం శక్తివంతమైన ఆయుధ సంపత్తి, టెక్నాలజీ ఉన్న దేశం అమెరికా. ఇటీవల వెనెజువెలాపై సైలెంట్‌గా జరిపిన ఆపరేషనే ఇందుకు నిదర్శనం. వెనెజువెలా టెక్నాలజీకి, రాడారలకు చిక్కకుండా యుద్ధ విమానాలు ఆ దేశంలో ల్యాండ్‌ అవడమే కాకుండా అధ్యక్షుడు, ఆయన భార్యను కిడ్నాప్‌ చేశారు. సైనిక శక్తిని మరింత ఆధునికీకరించేందకు ట్రంప్‌ సర్కార్‌ ఇటీవల ఏఐ యాక్సెస్‌ కోరింది. ఆంథ్రోపిక్‌ క్లాడ్‌ మోడల్స్‌ను సైనిక అవసరాలకు పూర్తి స్వేచ్ఛగా ఉపయోగించాలని డిమాండ్‌ చేసింది. శుక్రవారం వరకు డెడ్‌లైన్‌తో ఒత్తిడి తెచ్చారు. కానీ సీఈవో డారియో అమోడెయ్‌ తిరస్కరించాడు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని. మిలిటరీలో ఏఐ అపరిమిత ఉపయోగం నైతికతకు ఆటంకమని పేర్కొన్నారు.

ట్రంప్‌ కన్నెర్ర…
తమ ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంథ్రోపిక్‌ సీఈవోపై కన్నెర్రజేశాడు. దీంతో ఆంథ్రోపిక్‌తో అన్ని ఒప్పందాలు రద్దు, ప్రభుత్వ ఏజెన్సీలు వెంటనే వాడకం ఆపమని ఆదేశించారు. దీంతో ఆంథ్రోపిక్‌ అమెరికాను వీడాలని నిర్ణయించుకుంది.

Also Read: దూసుకొస్తున్న ఇజ్రాయెల్‌ క్షిపణులు.. వణుకుతున్న ఇరాన్‌ నగరాలు!

రంగంలోకి ఓపెన్‌ ఏఐ..
ఆంథ్రోపిక్‌ అమెరికాను వీడాలని నిర్ణయించిన వెంటనే ఓపెన్‌ఏఐ ఫైల్డ్‌లోకి దూకింది. పెంటగాన్‌తో కొత్త ఒప్పందం చేసుకుంద సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ ప్రకటించారు: రక్షణ అవసరాలకు ఏఐని నియంత్రణలో వాడుతామని తెలిపారు. ఇరువైపులా అంగీకరించిన హద్దుల్లో మోడల్స్‌ పనిచేసేలా టెక్నికల్‌ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందిస్తామని వెల్లడించారు. ఇది ట్రంప్‌ విధానానికి సరిపోతుంది.

ఆంథ్రోపిక్‌ నిర్ణయం ధైర్యసాహసం. బెదిరించినా విధానాలు మార్చకుండా పట్టుకున్నారు. నిఘా, ఆయుధాల్లో ఏఐ లేకుండా. ఇది ఏఐ పరిశ్రమలో నైతిక మార్గదర్శకంగా మారుతుంది. మరోవైపు ఓపెన్‌ఏఐ వాస్తవికత చూపింది. పరిమిత డీల్‌ల ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యం అయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper