Homeలైఫ్ స్టైల్E-bike vs Electric vehicle: ఈ బైక్, ఎలక్ట్రిక్ వెహికల్ కు తేడా ఏంటి? కాలిఫోర్నియాలో...

E-bike vs Electric vehicle: ఈ బైక్, ఎలక్ట్రిక్ వెహికల్ కు తేడా ఏంటి? కాలిఫోర్నియాలో ఉన్న కొత్త చట్టం ఎలా ఉంది?

E-bike vs Electric vehicle: పర్యావరణ కాలుష్యం సమతుల్యం చేయడానికి.. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి.. ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల ఈ బైక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ బైక్, ఎలక్ట్రిక్ వాహనాలు రెండు కూడాను విద్యుత్ తో నడిచే వాహనాలే. కానీ ఈ రెండిటిలో చాలా తేడాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ బైక్ ల వాడకం పెరిగిపోతుంది. అయితే కొందరు ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలను ఈ బైక్ […]

E-bike vs Electric vehicle: పర్యావరణ కాలుష్యం సమతుల్యం చేయడానికి.. పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకోవడానికి.. ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల ఈ బైక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ బైక్, ఎలక్ట్రిక్ వాహనాలు రెండు కూడాను విద్యుత్ తో నడిచే వాహనాలే. కానీ ఈ రెండిటిలో చాలా తేడాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ బైక్ ల వాడకం పెరిగిపోతుంది. అయితే కొందరు ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలను ఈ బైక్ గా పరిగణిస్తూ విక్రయిస్తున్నారు. దీనిపై అక్కడి ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టింది. అసలు ఈ బైక్, ఎలక్ట్రానిక్ మోటార్ సైకిల్ ల మధ్య ఉన్న తేడా ఏంటి? కాలిఫోర్నియాలో ఈ చట్టం తీసుకురావడానికి కారణం ఏంటి?

అమెరికాలోని సేనేటర్ క్యాథరిన్ బ్లాక్ స్పియర్ కొత్తగా SB 1167 అనే బిల్ ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలను.. ఈ బైక్ లుగా పరిగణించవద్దు. ఇలా తప్పుడు మార్కెట్ చేయడం వల్ల వినియోగదారులు వీటిని ఈ బైక్ ల వలె పరిగణించి ప్రమాదాలకు గురవుతుంటారు. అంతేకాకుండా ఈ బైక్ లకు ఇలాంటి రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేదు. కానీ ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం ఉంటాయి. వీటిని తప్పించుకోవడానికి కొన్ని కంపెనీలు ప్రచారం చేస్తున్నారని ఈ చట్టం తీసుకువచ్చింది.

అసలు ఈ బైక్, ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలకు కొన్ని తేడాలు ఉంటాయి. ముఖ్యంగా వాటి బ్యాటరీ సామర్థ్యం తో పాటు వేగంలో కూడా మార్పులు ఉంటాయి. ఈ బైక్ లలో 750 వాట్స్ వరకు మోటార్ పరిమితంగా ఉంటుంది. ఇందులో క్లాస్ 1( 20 mph పెడల్ అసిస్ట్), క్లాస్ 2 ( 20 mph థ్రాటిల్) , క్లాస్ 3 (28 mph పెడల్ అసిస్ట్) వరకు వేగం ఉంటుంది. అదే మోటార్ సైకిల్ అయితే ₹750 వాట్స్ కంటే ఎక్కువగా బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. వీటివేగం 30 ప్లస్ mph వేగంతో వెళ్తాయి. వీటిని ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గా భావిస్తారు. అయితే అమెరికా తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఈ బైక్ లు.. ప్రత్యేకంగా విక్రయాలు జరిగే పరిధిని దాటకుండా పరిమితి వేగంతో వెళ్తాయి. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యేకంగా గుర్తించబడి వీటికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా మారుతుంది. ఒకవేళ ఈ చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు దాఖలు చేయవచ్చు. కన్జ్యూమర్ లీగల్ రెమిడీస్ యాక్ట్ ప్రకారం మోసపూరిత అమ్మకాలుగా గుర్తిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper