వరసగా ఐదుసార్లు ఓటమెరుగని ఎమ్మెల్యే.. పలుమార్లు మంత్రి.. పీసీసీ పీఠం.. ఇదీ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కన్నా లక్ష్మీ నారాయణ వైభవం. కానీ.. రాష్ట్ర విభజనతో ఆయన రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడింది. 2014లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఓడిపోయారు. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లాలనుకున్నారు. కానీ.. చివర్లో రాత్రికి రాత్రే ప్లాన్ మార్చుకుని కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీకి ఏపీ అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత నరసారావుపేట ఎంపీగా పోటీ చేసినప్పటికీ విజయం వరించలేదు. ఆ తర్వాత పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. అధిష్టానం ఆయనను అధ్యక్ష పదవి నుంచి తప్పించింది.
Also Read: పరుష ప్రసంగానికి కేసీఆర్ పుల్ స్టాఫ్..!! ఆ రెండు ఎన్నికల తరువాత మారిపోయాడా..?
పడిపోయిన గ్రాఫ్…
బీజేపీ పార్టీ పగ్గాల నుంచి తప్పించాక, కన్నా రాజకీయ జీవితం మరింత కష్టాల్లో పడింది. బీజేపీలో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యమూ లేకుండా పోయింది. 1988 నుంచి 2014 వరకు కన్నాకు ఓ రేంజ్ లో ఉన్న క్రేజ్ మొత్తం పోయింది. దీంతో పూర్వ వైభవం కోసం తపిస్తున్న లక్ష్మీ నారాయణ.. బీజేపీని వీడే యోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే.. ఇప్పుడు వైసీపీలోకి వెళ్లలనుకున్నా ఆయన్ను తీసుకునే పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందు వెళ్లి ఉంటే సీనియర్‌గా గౌరవం ఉండేది. ఇప్పుడు వెళ్తే.. ఆయనతో ప్రత్యేక అవసరాలు లేవు కాబట్టి, ఆటలో అరటిపండే అవుతారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీయే అంటున్నారు. ఈ ప్రచారంతో గుంటూరు పాలిటిక్స్ పై ఆసక్తి నెలకొంది.
కన్నానే అడిగారా?
సంప్రదింపులు ఎవరి నుంచి మొదలయ్యాయంటే.. కన్నా లక్ష్మీనారాయణే స్వయంగా టీడీపీలోకి వస్తానని ఆ పార్టీ నేతలను కోరినట్టు చెబుతున్నారు. అయితే.. సత్తెనపల్లి శాసనసభ సీటుపై హామీ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. కానీ.. గుంటూరు టీడీపీలో తలపండిన సీనియర్లకు, కన్నాకు పాత గొడవలు చాలానే ఉన్నాయి. అందువల్ల వీళ్లలో చాలా మంది కన్నా లక్ష్మీనారాయణ రాకపై విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సీనియర్ నేతలతో రాయభారాలు..
ఎలాగైనా టీడీపీలో అడ్డంకులను తొలగించుకోవాలని చూస్తున్న కన్నా.. ఆ పార్టీలో తనకు పరిచయం ఉన్న సీనియర్ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. సత్తెనపల్లిలో టీడీపీకి ప్రస్తుతం ఇన్చార్జ్ ఎవ్వరూ లేరు. కోడెల శివప్రసాద్ మరణం తర్వాత ఈ సీటు కోసం ఆయన వారసుడు కోడెల శివరాంతో పాటు మాజీ ఎంపీ రాయపాటి తనయుడు రంగారావు కూడా పోటీ పడుతున్నారు. ఓ వైపు వీరిద్దరి మధ్య పోరు నడుస్తుండగానే విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను చంద్రబాబు సత్తెనపల్లికి పంపుతారన్న ప్రచారం కూడా జరిగింది. ప్రస్తుతానికి అది సెలెంట్ అయ్యింది. ఇలాంటి పరిస్తితుల్లో కన్నాకు.. ఆ సీటు ఇస్తారా? అనేది ప్రశ్న.
Also Read: ఏపీ కేబినెట్ మొత్తం మారినా.. వారి మంత్రి పదవులు సేఫ్..!
రాక మంచిదే అంటున్న కొందరు..
అయితే.. కన్నా టీడీపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతారు అనే వారు కూడా ఉన్నారు. రాజధాని వికేంద్రీకరణ నేపథ్యంలో గుంటూరులో ఇప్పటికే టీడీపీ పుంజుకున్న పరిస్థితి.. ఇలాంటి టైంలో కన్నా లక్ష్మీనారాయణ లాంటి పట్టున్న నేత తోడైతే అది పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని అంటున్నారు.
టీడీపీ ప్రచారమేనా?
అయితే.. ఇదంతా టీడీపీ చేస్తున్న ప్రచారమే అంటున్నారు కన్నా సన్నిహితులు. ఈ ప్రచారం బీజీపీ అధిష్టానం దృష్టిలో పడేట్టు చేయడం ద్వారా.. ఆ పార్టీలో కన్నాకు ప్రాధాన్యం తగ్గేలా చేసి, అనివార్యంగా సైకిల్ ఎక్కేలా చేయాలనే ప్లాన్ లో టీడీపీ ఉన్నట్టు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Will kanna lakshmi narayana leaves bjp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com