కొవిడ్-19తో గత కొన్ని రోజులుగా తీవ్రంగా పోరాడుతున్న సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ప్రకారం బాలుగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. బాలుగారి తనయుడు ఎస్పీ చరణ్ తన తండ్రి హెల్త్ గురించి ఓ వీడియోను రిలీజ్ చేస్తూ.. ‘నాన్నగారి ఆరోగ్యం వరుసగా నాలుగో రోజూ కూడా నిలకడగా ఉంది. వచ్చే సోమవారం నాటికి నాన్నగారి ఆరోగ్యం విషయంలో శుభవార్త వింటామని ఆశిస్తున్నాను. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను’’ అని ఎస్పీ చరణ్ స్పష్టం చేశారు. ఈ వీడియో సందేశంను బట్టి బాలుగారు కరోనాని జయించబోతున్నారు. ఆయన కోట్లాది మంది అభిమానులను తన గాత్రంతో మళ్ళీ అలరించనున్నారని తెలియగానే బాలుగారు అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పవన్ 30వ సినిమా కోసం గురుశిష్యుల పోటీ?
ఇక బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది ఆయనకి చికిత్సను అందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యం కూడా. హాస్పిటల్ రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ను బట్టి.. ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారికి వెంటిలేటర్, ఎక్మో సహాయంతో ప్రస్తుతం చికిత్స అందిస్తూ ఉన్నాము. అలాగే ఆయన ఐసీయూలో ఉన్నప్పటికీ.. ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది. ప్రత్యేకమైన వైద్య బృందం నిరంతరం బాలుగారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. మొత్తానికి బాలుగారి ఆరోగ్యం విషయంలో పాజిటివ్ న్యూస్ రావడంతో ఆయన కోట్లాది అభిమానులు ఊపిరి పీల్చుకున్నట్టు అయింది.
Also Read: ఎన్టీఆర్ పాత ఇంట్లో త్రివిక్రమ్ !
గత కొన్ని రోజులుగా బాలుగారు ఆరోగ్యం విషయంలో ఆయన అభిమానులు తీవ్ర మానసిక సంఘర్షణకు గురైయ్యారు. అలాగే సినీ మహామహులతో పాటు యావత్తు సినీ లోకమంతా బాలుగారి కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఇవ్వన్నీ ఆ దేవుడు అలకించాడేమో.. బాలుగారు పూర్తిగా కోలుకోబోతున్నారనే శుభవార్త వచ్చింది. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రి నిర్వాహకులు బాలుగారి ఆరోగ్యం కోసం ముందు నుంచీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన పూర్తిగా కోలుకున్నేలా శాయశక్తులా ప్రయత్నించారు. ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రి నిర్వాహకులకు బాలుగారి అభిమానులు ఎప్పటికీ రుణపడి ఉంటారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: We are hoping that there will be good news by monday spbs son charan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com