Homeవైరల్ వీడియోస్Viral video : లేగ దూడను కారు ఈడ్చుకెళ్ళింది.. అక్కడే ఉన్న ఆవులు ఏం చేశాయంటే.....

Viral video : లేగ దూడను కారు ఈడ్చుకెళ్ళింది.. అక్కడే ఉన్న ఆవులు ఏం చేశాయంటే.. మనుషులకు కనువిప్పు కలిగిస్తున్న వీడియో..

Viral video :  ఆ నీతి వాక్యాలను అమల్లో పెట్టడం మనుషులు మరిచిపోయారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయారు. ఐకమత్యాన్ని పక్కనపెట్టి ఒంటరిగా ఉండిపోతున్నారు. సమష్ఠితత్వాన్ని దూరం చేసుకుని ఏకాకిగా మిగిలిపోతున్నారు. సాటి మనిషికి కష్టం వస్తే పట్టించుకోకుండా.. నాకెందుకు ఆ తలనొప్పి అంటూ దూరం వెళ్లిపోతున్నారు. తద్వారా ఎవరికివారుగా జీవిస్తున్నారు. అయితే అలా మారిపోయిన మనుషులకు కనువిప్పు కలిగించేలా ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ దర్శనమిస్తోంది. అది ఎప్పుడు జరిగిందో తెలియదు. ఎక్కడ జరిగిందో తెలియదు. కాకపోతే ఐకమత్యంగా ఉంటే ఎలా ఉంటుంది? సమష్టి తత్వాన్ని పెంపొందించుకుంటే ఎలాంటి ఫలితం వస్తుంది? బృందంగా ఉంటే ఎలాంటి పని చేయవచ్చు? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఇస్తోంది. సామాజిక మాధ్యమాలలో దర్శనం ఇస్తున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కారు లేగ దూడను ఈడ్చు కెళ్ళింది. ఆ కారు కింద ఉన్న లేగ దూడ ఆర్త నాదాలు చేయడం మొదలుపెట్టింది. దీంతో అక్కడే ఉన్న ఆవులు వేగంగా పరుగు తీశాయి. కారుతో సమానంగా పరిగెత్తి.. చివరికి ఆ వాహనాన్ని చుట్టుముట్టాయి. కారు మీద దండయాత్ర చేశాయి.

కారును పైకి లేపి

ఒక్కసారిగా ఆవుల మంద పరిగెత్తుకుంటూ రావడంతో స్థానికులకు ఏం జరిగిందో అర్థం కాలేదు.. దీంతో ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా దానిని ఆపాడు. వెంటనే స్థానికులు ఆ కారు చుట్టూ గుమిగూడారు. ఆ తర్వాత స్థానికుల్లో కొంతమంది ఆ కారును పైకి లేపి లేగ దూడను కాపాడారు. లేగ దూడను బయటికి తీసిన తర్వాత ఆవులు శాంతించాయి. వెంటనే గాయపడిన లేగ దూడ వద్దకు వెళ్లాయి. నాలుకతో దానిని ప్రేమగా నిమరాయి. ఆ తర్వాత స్థానికులు దానిని వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆ లేగ దూడకు చికిత్స చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గాని జంతువుల్లో ఐకమత్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇదే సమయంలో సమష్టి తత్వాన్ని కోల్పోయిన మనుషులకు కనువిప్పు కలిగిస్తోంది. “మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది. సంఘటితశక్తి అంతకంతకు కనుమరుగవుతోంది. ఇలాంటి సమయంలో జంతువులు ఐకమత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సాటి జంతువుకు కష్టం కలిగితే అవి సమష్టి తత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. మనుషులు ఏం కోల్పోతున్నారో చెబుతున్నాయి. ఇలాంటి వీడియోలు చూసైనా మనుషులు మారాలి. లేనిపక్షంలో ఇబ్బందులు పడక తప్పదు. లేగ దూడ కోసం అన్ని ఆవులు ఏక బిగిన వచ్చాయంటే మామూలు విషయం కాదు. అందు గురించే ఐకమత్యం అనేది కచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా మనుషుల మధ్య ఉండాలి. అప్పుడే ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎన్ని బాధలు ఎదురైన సమర్థవంతంగా ఎదిరించగలరని” నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular