Homeట్రెండింగ్ న్యూస్Minister Sridhar Babu : టాలీవుడ్ ఏపీకి వెళ్లొద్దు.. రిక్వెస్ట్ చేసిన రేవంత్ సన్నిహిత మంత్రి.....

Minister Sridhar Babu : టాలీవుడ్ ఏపీకి వెళ్లొద్దు.. రిక్వెస్ట్ చేసిన రేవంత్ సన్నిహిత మంత్రి.. వైరల్

Minister Sridhar Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి విడుదలైన పుష్ప 2 సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రికార్డులు కొల్లగొడుతోంది. అయితే ఘన విజయాన్ని తెలుగు ఇండస్ట్రీ ఎంజాయ్‌ చేయలేకపోతోంది. ముఖ్యంగా సినిమా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ సంబరాలకు దూరంగా ఉంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం బెనిఫిట్‌షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనే కారణం. బెనిఫిట్‌ సో చూసేందుకు డిసెంబర్‌ 4న అర్ధరాత్రి అర్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందింది. ఆమె కొడుకు రోహిత్‌ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తరుణంలో సంధ్య థియేటర్‌ యాజమాన్యంతోపాటు సినిమా హీరో అల్లు అర్జున్‌పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. అర్జున్‌ను అరెస్టు కూడా చేశారు. బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడిప్పుడే వివాదం సర్దుకుంటోంది. ఈక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, ఆ వెంటనే అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది.

ఇండస్ట్రీ ఇక్కడే..
సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌ తీరును తప్పు పడుతుండగా, సీఎం సన్నిహితుడైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్‌లోనే ఉండాలని రిక్వెస్ట్‌ చేశారు. డిసెంబర్‌ 4న అల్లు అర్జున్‌ సంధ్య థియేటర్‌కు రావడం, అక్కడ తొక్కిసలాట జరగడం, మహిళ మృతి, బాబు స్పృహతప్పడం వంటి ఘటనలపై హైదరాబాద్‌ సీపీ సీవీ.ఆనంద్‌ వీడియో విడుదల చేశారు. దీంతో ఇండస్ట్రీ హైదరాబాద్‌ నుంచి తరలిపోతుందన్న ప్రచారం జోరందుకుంది. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. అల్లు అర్జున్‌ డిసెంబర్‌ 4న రోడ్‌షో చేశారా లేదా అనేది వీడియో చూస్తే అర్థమవుతుందన్నారు. పోలీసులు పర్మిషన్‌ ఇచ్చారా లేదా.. సంధ్య థియేటర్‌ నుంచి కారులో నిలబడి అభిమానులకు అభివాదం చేయడం తదితర విషయాల్లో వాస్తవాలు అల్లు అర్జున్‌కు కూడా తెలుసని చెప్పారు.

బాధిత కుటుంబానికి అండగా ఉండాలని..
సినీ ఇండస్ట్రీని సీఎం టార్గెట్‌ చేయలేదని శ్రీధర్‌బాబు తెలిపారు. అరెస్ట్‌ అయినందుకు అల్లు అర్జున్‌ను పరామర్శిస్తున్న సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని సీఎం ఆవేదన చెందారన్నారు. అందుకే ఆరోజు జరిగిన ఘటనపై అసెంబ్లీలో బాధతో మాట్లాడారని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉండాలన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలు, రాయితీల విషయంలో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు.

శ్రీధర్‌బాబు రిక్వెస్ట్‌ వైరల్‌…
తెలుగు సినిమా ఇండస్ట్రీ తరలిపోతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్‌బాబు చేసిన రిక్వెస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై తెలుగు సినీ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. అల్లు అర్జున్‌ను టార్గెట్‌ చేయడం వెనుక కుట్ర ఉందని చాలా మంది భావిస్తున్నారు. ఈమేరకు కామెంట్‌ చేస్తున్నారు. పొరపాటున జరిగిన దానికి ఈ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular