Viral video : ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. యువత ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతున్నారు. అయితే సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క వీడియో ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పెడితే చాలు.. ఇక ఆ వీడియోని బట్టి అది ట్రెండ్ అవుతుంది. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయితే ఫేమస్ అవుతామనే ఉద్దేశంతో చాలా మంది ఇలా చేస్తున్నారు. అయితే ఫన్నీ కోసం చేసిన వీడియోలు కొన్ని సార్లు వైరల్ అవుతాయి. అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఏదో ఫన్నీ కోసం చేసిన వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. వెన్నెల కిషోర్, అనుదీప్ మధ్య జరిగిన కామెడీ ఒక రీల్ మస్తు వైరల్ అవుతుంది. వెన్నెల కిషోర్ తో ఓ ఇంటర్వ్యూలో అనుదీప్ అతనికి మరిచిపోలేని ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ చూసి వెన్నెల కిషోర్ కూడా షాక్ అయ్యాడు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటి? దానిని చూసి వెన్నెల కిషోర్ ఎందుకు షాక్ అయ్యాడో మరి చూద్దాం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వెన్నెల కిషోర్, అనుదీప్ ఇంకా మిగతా వారు ఉన్నారు. అనుదీప్ టీమ్ వెన్నెల కిషోర్ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నారు. ఆ గిఫ్ట్ చూసి ఆఖరికి వెన్నెల కిషోర్ షాక్ అయ్యాడు. అనుదీప్ టీమ్.. మీ ఇమేజ్ మా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోవాలని.. మీకు మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అని ఇస్తారు. దాన్ని చూసి వెన్నెల కిషోర్ షాక్ అవుతూ.. ఈ గిఫ్ట్ అతనికే ఇవ్వచ్చు కదా అని అంటాడు. ఇంతకీ గిఫ్ట్ ఏం అనుకుంటున్నారా.. అందులో వెన్నెల కిషోర్ ఫోటో ఫ్రేమ్ ఉంది. చెప్పుకోవడానికి వెన్నెల కిషోర్.. కానీ చూడటానికి అలా ఉండదు. వెన్నెల కిషోర్ పెయింటింగ్ ఎప్పటికీ వాళ్ల గుండెల్లో నిలిచిపోవాలని.. ఈ gift ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనికి నెటిజన్లు స్పందిస్తూ.. మీ పెయింటింగ్ సల్లగుండా ఏమో.. కానీ వెన్నెల కిషోర్ కే షాక్ ఇచ్చారు కదా అని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ఫొటోలో ఉన్న అతను దొరకలేదు అందుకే మీకు ఇచ్చారని కామెంట్ చేస్తున్నారు. కొందరైతే.. అనుదీప్, వెన్నెల కిషోర్ కామెడి టైమింగ్ బాగుందని, మంచి రిలీఫ్ అని కామెంట్లు చేస్తున్నారు. అసలు ఫొటోలో ఉన్నది వెన్నెల కిషోర్.. కాదని కొందరు సందేహిస్తున్నారు. మరి మీరు ఏం అంటారో.. మీకు ఏం అనిపించిందో కామెంట్ చేయండి.
Bhaskar Katiki is the main admin of the website
Read More