Bhuma Mounika Reddy First Husband: మంచు మోహన్ బాబు రెండవ కుమారుడు మంచు మనోజ్ రెండవ పెళ్లి ప్రముఖ రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక తో నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు లక్ష్మి ప్రసన్న స్వగృహం లో బంధుమిత్రుల సమక్ష్యం లో చాలా సాధారణంగా జరిగింది.
2019 వ సంవత్సరం లో తన మొదటి భార్య ప్రణతి రెడ్డి తో విడాకులు తీసుకున్న మనోజ్, ఆ తర్వాత భూమా మౌనిక రెడ్డి తో ప్రేమాయణం నడపడం,గత కొంతకాలం గా వీళ్లిద్దరు డేటింగ్ లో ఉండడం వంటి వార్తలు సోషల్ మీడియా లో తరుచూ ప్రచారం అవుతూ ఉండేవి.మోహన్ బాబు కి ఈ పెళ్లి ఇష్టం లేదనే వార్తలు వినిపించాయి కానీ, నిన్న ఆయన ఈ పెళ్ళికి హాజరై అన్నీ దగ్గరుండి చూసుకొని సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే వార్తలకు చెక్ పెట్టాడు.
ఇది ఇలా ఉండగా కేవలం మనోజ్ కి మాత్రమే కాదు, మౌనిక రెడ్డి కి కూడా ఇది రెండవ పెళ్లి.గతం లో ఆమె బెంగళూరు కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త గణేష్ రెడ్డి ని పెళ్లాడింది.వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు,అయితే రెండేళ్ల క్రితం వీళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణం గా విడిపోవాల్సి వచ్చింది.ప్రస్తుతం కొడుకు మౌనిక రెడ్డి తోనే ఉంటున్నాడు.రాజకీయాల్లో తన అక్క అఖిల ప్రియా కోసం విస్తృతంగా ఎన్నికల ప్రచారం చెయ్యడం దగ్గర నుండి ఈ వీళ్ళ మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి అని, అది కాస్త పెద్ద గొడవలుగా మారిపోయి విడిపోవాల్సి వచ్చిందని తెలుస్తుంది.
ఇక మంచు మనోజ్ – మౌనిక రెడ్డి పెళ్లి విశేషాల్లోకి వెళ్తే ఇండస్ట్రీ లో మనోజ్ కి అతి దగ్గరగా ఉన్నవాళ్ళని మాత్రమే ఆహ్వానించాడట మనోజ్, మరో విశేషం ఏమిటంటే మంచు విష్ణు కేవలం ఒక మామూలు అతిథిగా మాత్రమే వచ్చి ఒక 20 నిమిషాల పాటు ఉండి వెళ్లిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Who is the first husband of bhuma mounika reddy is that the reason for breaking up with him
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com