spot_img
Homeఎంటర్టైన్మెంట్Waltair Veerayya Title Song: వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్... మాస్ ఎలివేషన్స్, ఫ్యాన్స్ కి...

Waltair Veerayya Title Song: వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్… మాస్ ఎలివేషన్స్, ఫ్యాన్స్ కి గూస్ బంప్స్!

Waltair Veerayya Title Song: వాల్తేరు వీరయ్య చిత్రం నుండి వస్తున్న ఒక్కో సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంటుంది. ఫస్ట్ సింగిల్ ‘బాస్ పార్టీ’ అనే మాస్ ఐటెం నంబర్ విడుదల చేసిన చిత్ర యూనిట్… రెండవ పాటగా ‘శ్రీదేవి చిరంజీవి’ అంటూ డ్యూయట్ రిలీజ్ చేశారు. తాజాగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ తో వచ్చారు మేకర్స్. సినిమాలో చిరంజీవి పాత్ర స్వభావం తెలియజేసేలా దేవిశ్రీ అద్భుతంగా కంపోజ్ చేశారు. చిరు ఇమేజ్ ని ఎలివేట్ చేసేలా సాంగ్ చక్కగా కుదిరింది. ఇక చంద్రబోస్ ఇచ్చిన సాహిత్యం అదిరిపోయింది. మొత్తంగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్… అభిమానుల అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్ళేదిగా ఉంది.

Waltair Veerayya Title Song
Waltair Veerayya Title Song

ఈ సాంగ్ కి ఉన్న మరొక విశేషం… వాల్తేరు వీరయ్య కొత్త గెటప్ ఇంట్రడ్యూస్ చేశారు. మొదటి నుండి ఈ చిత్రంలో చిరుని లుంగీ ధరించి ఊరమాస్ అవతార్ గా ప్రజెంట్ చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ లో మాత్రం ఆయనను ఓ డాన్ గా చూపించారు. గన్స్, ఎలివేషన్స్ తో చిరంజీవి మేనరిజం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి పాత్రలో ఊహించని షేడ్స్ ఉంటాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ ని అనురాగ్ కులకర్ణి, పవిత్ర చారి పాడారు.

వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. బాలయ్య వీరసింహారెడ్డి ఒకరోజు ముందు 12న విడుదల అవుతుంది. చిరు-బాలయ్యలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీ-థమన్ కూడా పోటీపడుతున్నారు. బెస్ట్ ఆల్బమ్ ఇవ్వాలని, ఒకరిపై మరొకరు పై చేయి సాధించాలని చూస్తున్నారు. 2020 సంక్రాంతికి మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో చిత్రాలు విడుదలయ్యాయి. మహేష్ చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించగా, అల్లు అర్జున్ కి థమన్ మ్యూజిక్ ఇచ్చాడు.

Waltair Veerayya Title Song
Waltair Veerayya Title Song

అప్పుడు థమన్ స్పష్టమైన ఆధిక్యత కనబరిచాడు. అల వైకుంఠపురంలో మూవీ సాంగ్స్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి నుండి మూడు సాంగ్స్ వచ్చాయి. ప్రస్తుతానికి వాల్తేరు వీరయ్య సాంగ్స్ జనాల్లోకి వెళుతున్నాయి. ఫైనల్ రిజల్ట్ తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. దర్శకుడు బాబీ వాల్తేరు వీరయ్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ మహరాజ్ రవితేజ విక్రమ్ సాగర్ ఏసీపీ గా కీలక రోల్ చేస్తున్నారు.

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper