viral chiru
Viral : చిరంజీవి మెగాస్టార్ ఎందుకయ్యాడంటే? ఆయన నటన, ముఖ్యంగా డ్యాన్సులు.. మంచి సినిమాలతో ఈ స్థాయికి ఎదిగాడు. ముఖ్యంగా చిరంజీవికి ఉన్న గ్రేసు, క్రేజు మరొకరికి రాదు.. ఆయన స్టైలే వేరు.. చిరంజీవి సృష్టించిన ట్రెండ్ సెట్టర్ మరొకరికి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు.
viral chiru
చిరంజీవి నర్తించిన పాటలు ఇప్పటికీ అందరూ వింటూ.. డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే చిరంజీవిలా కాకున్నా ఆయనను అనుకరించే ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడి నుంచి వచ్చాడో ఈ గ్రహాంతర వాసి చిరంజీవి పాటను వేసుకొని దాదాపు ఖునీ చేస్తున్నాడు.
చూడ్డానికి ఏజ్ అయిపోయి 50 ఏళ్లు దాటిన ఒక పెద్దమనిషి ఊడిపోయిన జుట్టుతో.. బట్టతల వేసుకొని ఒక మంచి యంగ్ లేడీతో కలిసి చిరంజీవి పాటలపై వేసిన డ్యాన్సులు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ముందు పొట్ట వేసుకొని ఎత్తుపళ్లతో చిరంజీవిలా ఇతగాడు చేస్తున్న డ్యాన్సులు తెగ నవ్వు పుట్టిస్తున్నాయి.
ఈ ముసాలయన ఈ ఏజ్ లో చిరంజీవిలా స్టెప్పులు వేస్తుంటే అందరూ తెగ నవ్వుకుంటున్నారు.కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఎవరీ గ్రహాంతర వాసి.. ‘చిరంజీవి’ పాటల్ని ఇలా ఖునీ చేస్తున్నాడు?’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. పక్కనే అందమైన యంగ్ ఆడపిల్ల ఉండడంతో ‘ముసలోడికి దసర రైకా’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
మొత్తంగా చిరంజీవి పాటలపై ఈ లేటు వయసు వ్యక్తి చేసిన డ్యాన్సులు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఆ వీడియోలను మీరూ చూసి నవ్వుకోండి.
వీడియోలను కింద లింక్ లో చూడొచ్చు.
https://www.facebook.com/100010770754007/videos/1343148266145776/
https://www.facebook.com/100010770754007/videos/pcb.1571801939855483/1343148266145776