Homeసినిమా వార్తలుChinmayi హిట్ పుట్టిస్తున్న సింగర్ చిన్మయి వ్యాఖ్యలు..!

Chinmayi హిట్ పుట్టిస్తున్న సింగర్ చిన్మయి వ్యాఖ్యలు..!

Singer Chinmayi  మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రముఖ సింగర్ చిన్మయి నిత్యం గళం విప్పుతూ ఉంటారు. బాధితుల పక్షాన పోరాడాటానికి, నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ఆమె ఏమాత్రం సంకోచించరు. సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్న చిన్మయి మరోసారి తన ట్వీటర్లో హిట్ పుట్టించే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

two nri's supporting singer chinmayi sripada about women issue

2017లో ఓ ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. ఆమెను ఓ ప్రముఖ హీరో కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈక్రమంలో బాధిత హీరోయిన్ అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసిన సంగతి అందరికీ తెల్సిందే.

ఈ వ్యవహారంపై అప్పట్లో బాధిత హీరోయిన్ కు సెలబ్రెటీల నుంచి భారీగా మద్దతు లభించింది. ప్రముఖ మలయాళీ నటి పార్వతి తిరువోత్ మహిళా సంఘాలతో కలిసి హీరోయిన్ కు అండగా పోరాటం చేశారు. ఆ తర్వాత పోరాటం మధ్యలోనే నిలిపోయింది. ఈక్రమంలోనే పార్వతి తిరువోత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

అప్పట్లో బాధిత హీరోయిన్ కు తాను అండగా నిలువడంతో తనకు అవకాశాలు తగ్గాయని ఇంటర్వ్యూలో చెప్పింది. తాను నటించిన సినిమాలు హిట్టయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదని వాపోయింది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడమే నేరమైపోయిందని చెప్పింది. దీనిపై సింగర్ చిన్మయ్ తన ట్వీటర్ వేదికగా స్పందించారు.

‘‘నిజం మాట్లాడినందుకు పార్వతి లాంటి ఒక మంచి నటి పని కోల్పోయింది.. అలాంటి నటి, లైంగిక వేధింపుల నుంచి తప్పించుకున్న వారి తరఫున మాట్లాడటం వల్ల మాత్రమే తన పని కోల్పోయిందని చెప్పడం నిజం.. చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు.. రేపిస్టులను మాత్రమే సమాజం ప్రేమిస్తుంది’’ అంటూ చిన్మయి ఘాటుగా ట్వీటర్లో వ్యాఖ్యలు చేసింది. ప్ర‌స్తుతం ఆమె ట్వీట్ నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] Sai Dharam Tej: యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురి అయినప్పటి నుంచీ పూర్తి ఇంటికే పరిమితం అయిపోయాడు. ఇన్నాళ్లు కొత్త సినిమా ముచ్చట్లు కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా సాయి తేజ్ కూడా తన ఫ్యాన్స్ కి తన సినిమాలకు సంబంధించి ఎటువంటి సందేశం ఇవ్వలేదు. నేను కొలుకున్నాను అంటూ ఆ మధ్య సాయి తేజ్ మెసేజ్ అయితే చేశాడు. ఆ తర్వాత తన కెరీర్ గురించి, తన కొత్త చిత్రాల సంగతుల గురించి తేజ్ ఎక్కడా బయట పెట్టలేదు. కాకపోతే ప్రమాదం జరిగిన రెండు నెలల తర్వాత సాయి ధరమ్ తేజ్ కెమెరా ముందుకు వచ్చారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular