Ananya Panday: బాలీవుడ్ హీరోయిన్ ఫొటో పక్కన ఉన్న ఈ పాప ఇప్పుడు బోల్డ్ హీరోయిన్..

Ananya Panday: సినిమాల్లో స్టార్లు కావడం అంటే మామూలు విషయం కాదు. కొందరికి సినీ బ్యాక్రౌండ్ ఉన్నా వారికి గుర్తింపు రావడానికి సమయం పడుతుంది. అయితే అదృష్టవశాత్తూ కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే బిగ్ స్టార్లుగా మారిపోతారు. ఇలాంటి వారు బాలీవుడ్లో చాలా మందే ఉన్నారు. బీటౌన్ లో ఇప్పుడు కొనసాగుతున్న వారు తండ్రులు, ఇతర వారసత్వం నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడ విశేషమేంటేంటే వారు స్టార్లు అయ్యే వరకు బ్యాక్రౌండ్ గురించి […]

Written By: Chai Muchhata, Updated On : April 7, 2023 8:50 am
Follow us on

Ananya Panday

Ananya Panday: సినిమాల్లో స్టార్లు కావడం అంటే మామూలు విషయం కాదు. కొందరికి సినీ బ్యాక్రౌండ్ ఉన్నా వారికి గుర్తింపు రావడానికి సమయం పడుతుంది. అయితే అదృష్టవశాత్తూ కొందరు ఒకటి, రెండు సినిమాలతోనే బిగ్ స్టార్లుగా మారిపోతారు. ఇలాంటి వారు బాలీవుడ్లో చాలా మందే ఉన్నారు. బీటౌన్ లో ఇప్పుడు కొనసాగుతున్న వారు తండ్రులు, ఇతర వారసత్వం నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే ఇక్కడ విశేషమేంటేంటే వారు స్టార్లు అయ్యే వరకు బ్యాక్రౌండ్ గురించి తెలియనివ్వట్లేదు. ఆ తరువాత వారి గురించి తెలిసి షాక్ అవుతున్నారు. ఇటీవల బోల్డ్ భామ గా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తున్న ‘ఓ హీరోయిన్ హిస్టరీ కూడా అలాగే ఉంది. కొన్ని సినిమాలతోనే ఆమె స్టార్ అయింది.

ఆమెకు సినీ బ్యాగ్రౌండ్ తో పాటు అదృష్టం కూడా తోడవ్వడంతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. మన తెలుగు సినిమాల్లోనూ అడుగుపెట్టిన ఈమె తన చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ట్ వేసిన ఓ పెయింట్ ఫొటో వద్ద ఈ క్యూట్ బేబీ నవ్వుతూ కనిపించింది. ఏమాత్రం గుర్తుపట్టకుండా ఉన్న ఈమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు సినిమాల గురించి తెలిసిన వారు ఆమె ఎవరో చెప్పేస్తున్నారు. అయితే గుర్తుపట్టలేనివారి కోసం ఆమె వివరాలు మేం చెబుతాం.

బీ టౌన్ లో నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. ఒకప్పుడు బాలీవుడ్లో అవకాశం వస్తే లైఫ్ సెటిల్ అయినట్లేనని భావించారు. అలాంటి సందర్భాల్లో చుంకీ పాండే హీరోగా గుర్తింపు పొందారు. ఆమెకు ఓ కూతురు ఉంది. ఆమెనే అనన్య పాండే. అనన్య పాండే గురించి తెలియని సినీ ఆడియన్స్ లేరు. తన అందచందాలతో పాటు బోల్డ్ షో ఇచ్చి స్టార్ అయింది. ఆ తరువాత అమ్మడుకు సినీమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తరువాత పతి పత్నీ ఔర్ వో.. ఆంగ్రేజీ మీడియం, ఖాలిపిలీ సినిమాల్లో నటించింది.

Ananya Panday

తెలుగులో డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తీసిన ‘లైగర్’లో ఈ భామ మెరిసింది. ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీంతో ఆమెకు ఫాలోవర్స్ విపరీతంగా పెరిగారు. ఇటీవల తన చిన్ననాటి ఫొటో షేర్ చేసింది. అలనాటి హీరోయిన్ రేఖ ఆర్ట్ ఫొటో ప్రేమ్ పక్కన నిల్చున ఈమెను చూసి క్యూట్ బేబీ అంటూ మెసేజ్ లు పెడుతున్నారు. ఇప్పుడీ పిక్ వైరల్ అవుతోంది.