Ryan Parag : గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎన్నో సంచలనాలు చోటుచేసుకున్నాయి. కాకపోతే వీటన్నింటికంటే ఎక్కువ వైరల్ అయింది మాత్రం రియాన్ పరాగ్(riyan paraag) వ్యవహారం. రియాన్ పరాగ్ గత ఏడాది తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేశాడు. 15 మ్యాచ్లో ఆడి.. 573 పరుగులు చేశాడు. ఇందులో హైయెస్ట్ స్కోర్ 84*. రియాన్ పరాగ్ గత ఏడాది ఐపీఎల్ మ్యాచ్ పూర్తయిన తర్వాత లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో అతడి సెర్చ్ హిస్టరీ బయటపడింది.. సరి వద్ద spotify, యాపిల్ మ్యూజిక్స్ వంటివి లేవు. అవి డిలీట్ చేయడంతో యూట్యూబ్లో అతడు సెర్చ్ చేయాల్సి వచ్చింది. లైవ్ స్ట్రీమింగ్ పూర్తయిన తర్వాత ఆ రాత్రి మొత్తం తన గురించి చర్చ జరిగిందని రియాన్ పరాగ్ ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ఐపీఎల్ 2024లో రియాన్ పరాగ్ ఒకసారి గా వార్తల్లోకి ఎక్కాడు. అతడు బ్యాటింగ్ రికార్డ్స్ తో పాటు యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ ద్వారా నెట్టింట చర్చకు దారి తీశాడు. పరాగ్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీలో అనన్య పాండే, సారా ఆలీ ఖాన్ వీడియోలు సెర్చ్ చేసిన స్క్రీన్ షాట్ అప్పట్లో తెగ చర్చకు దారి తీసింది.. ఐపీఎల్ లో రియాన్ పరాగ్ భారీగా స్కోర్ చేయడానికి ఇవే కారణాలని నెట్టింట తెగ ప్రచారం జరిగింది.. అయితే దీనిపై రియాన్ పరాగ్ క్లారిటీ ఇచ్చాడు..” మ్యాచ్ పూర్తయిన తర్వాత.. లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న సమయంలో నా హిస్టరీ బయటపడింది. నా దగ్గర spotify, యాపిల్ మ్యూజిక్స్ వంటివి లేవు. యూట్యూబ్లో సెర్చ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అవి సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. ఆ సెర్చ్ హిస్టరీ గురించి క్లారిటీ ఇద్దామని అనుకున్నాను. కానీ ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. అందుకే దానిని ఎలా వదిలేశానని” రియాన్ పరాగ్ పేర్కొన్నాడు. ఆ మధ్య అతడి సెర్చ్ హిస్టరీ బయటపడటంతో.. సారా ఆలీ ఖాన్, అనన్య పాండే మధ్య ఏదో జరుగుతోందని బీ – టౌన్ లో పుకార్లు షికార్లు చేశాయి. మొత్తానికి పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో రియాన్ పరాగ్ స్పష్టత ఇవ్వడంతో.. ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఇక ఇటీవల రియాన్ పరాగ్ ఉత్తరప్రదేశ్లో ఒక ఇల్లు కొనుగోలు చేశాడు.. పేదరికం నుంచి వచ్చిన అతడు ఇటీవల జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో ధరను దక్కించుకున్నాడు. దీంతో అతడు ఒక ఇల్లు కొనుగోలు చేశాడు. తన కుటుంబాన్ని అందులోకి షిఫ్ట్ చేశాడు..
