https://oktelugu.com/

Manchu Family: ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో మంచు ఫ్యామిలీ… మోహన్ బాబు, మనోజ్ ఛీప్ కామెంట్స్!

Manchu Family: మంచు ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంది. అంతర్గత కుమ్ములాటలు, ఫెయిల్యూర్స్, మీడియా ఒత్తిడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తంగా ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్ తోనే మంచు మనోజ్ కుటుంబ పరువు రోడ్డుకు లాగాడు. అన్నదమ్ముల గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ట్రై చేసి విష్ణు అబాసుపాలయ్యారు. విష్ణు హౌస్ ఆఫ్ మంచూస్ రియాలిటీ షో డ్రామా రక్తి కట్టలేదు. పైగా ఇంకా […]

Written By:
  • Shiva
  • , Updated On : April 7, 2023 / 08:54 AM IST
    Follow us on

    Manchu Family

    Manchu Family: మంచు ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంది. అంతర్గత కుమ్ములాటలు, ఫెయిల్యూర్స్, మీడియా ఒత్తిడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తంగా ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్ తోనే మంచు మనోజ్ కుటుంబ పరువు రోడ్డుకు లాగాడు. అన్నదమ్ముల గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ట్రై చేసి విష్ణు అబాసుపాలయ్యారు. విష్ణు హౌస్ ఆఫ్ మంచూస్ రియాలిటీ షో డ్రామా రక్తి కట్టలేదు. పైగా ఇంకా అనుమానాలు బలపరిచింది. కాలు బయట పెట్టాలంటే మీడియాకు ఏం సమాధానం చెప్పాలనే ఓ అసహనం వెంటాడుతుంది.

    దాని తాలూకు ఆనవాళ్లు మోహన్ బాబు, మనోజ్ మాటల్లో స్పష్టంగా కనిపించాయి. తిరుపతిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఈవెంట్లో మోహన్ బాబు, మనోజ్, మౌనిక పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీ కుటుంబంలో కలహాలు ఉన్నాయన్న ప్రచారం మీద స్పందించాలని ఓ విలేకరి మోహన్ బాబును అడిగారు. దానికి మోహన్ బాబు చేసిన కామెంట్ కొంచెం కఠినంగా ఉంది. ‘మీ ఇంట్లో మీ భార్యతో నీకున్న సంబంధం ఏమిటో చెబుతావా?. సందర్భాన్ని బట్టి ప్రశ్నలు అడగండి. మీరు చదువుకున్నవారు… అని ఆవేశపడ్డారు.

    Manchu Family

    ఆయన స్పందించిన తీరు హుందాగా లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దాని గురించి మాట్లాడటం ఇష్టం లేకపోతే… నో కామెంట్స్ అని ఒక్క పదం చెబితే సరిపోతుంది… భార్యలు బంధాల వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది చెప్పండి. తండ్రి మోహన్ బాబుకు మించిన అతి సమాధానం మనోజ్ చెప్పాడు. అన్నయ్య విష్ణుతో మీకు ప్రాబ్లమ్ ఏంటని అడగ్గా… ఈ మధ్య నాకు సెగ్గడ్డ వచ్చింది. వచ్చి గోకుతారా? అదే నా ప్రాబ్లమ్ అని… మరీ ఛీప్ కామెంట్స్ చేశారు.

    మంచు ఫ్యామిలీ వెనుకబడి పోవడానికి ఈ అతే కారణం. జనాల్లో ఈ ఫ్యామిలీ మీద ఒక రకమైన నెగిటివిటీ పెరిగిపోయింది. పబ్లిక్ లో నోటికి వచ్చింది మాట్లాడటం. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ఘనులు. నేల మీద పడ్డా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకెప్పుడు తీరు మార్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు వాపోతున్నాయి. విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతా అనే మోహన్ బాబుకు, కొడుకుల గొడవల విషయంలో డొంకతిరుగుడు వ్యవహారం ఎందుకు? నేరుగా చెప్పేస్తే పోలా…