Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన ‘శ్రీనివాస మంగపురం’ చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోపక్క జయకృష్ణ బాబాయ్ మహేష్ బాబు అభిమానుల సపోర్టు కూడా ఈ సినిమాకి ఉంది. కాబట్టి కచ్చితంగా ఈ చిత్రానికి మొదటి రోజు ఓపెనింగ్స్ భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. అంతే కాకుండా కాసేపటి క్రితమే మహేష్ బాబు ఈ చిత్రానికి సపోర్టు చేయాలంటూ ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పైగా ఈ చిత్రానికి RX 100 , మంగళవారం వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన అజయ్ భూపతి దర్శకత్వం వహించారు.
కాబట్టి ఈ చిత్రం మినిమం గ్యారంటీ రేంజ్ లో ఉంటుందని అనుకోవచ్చు. అయితే రీసెంట్ గానే మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ కాపీ ని ప్రివ్యూ షో లాగా చూశారట. ఈ ప్రివ్యూ షో కి ఇండస్ట్రీ కి సంబంధించిన కొంతమంది ప్రముఖులు కూడా వచ్చారని సమాచారం. వాళ్ళ నుండి ఈ చిత్రానికి వస్తున్న టాక్ ని చూస్తుంటే , జయకృష్ణ మొదటి సినిమాతోనే కుంభస్థలం బద్దలు కొట్టేలా అనిపిస్తోంది. సినిమాకు బలమైన స్టోరీ బ్యాక్ డ్రాప్ ఉందట. ఫస్ట్ హాఫ్ మొత్తం యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుందట. ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు సినిమా వేరే లెవెల్ లో ఉందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు , లవ్ ట్రాక్ చాలా బాగా కుదిరిందని అంటున్నారు. ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా వచ్చాయట.
హీరో జయకృష్ణ నటన తో పాటు , రషా తాండన్ నటన కూడా చాలా బాగుందని , మోహన్ బాబు పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని , వరుస సూపర్ హిట్స్ తో కళకళలాడుతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ జోరు ని , ఈ సినిమా కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తుందని , ఈ ఏడాది మరో భారీ బ్లాక్ బస్టర్ ని టాలీవుడ్ చూడబోతుందని అంటున్నారు. ఇకపోతే ఈ చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇదే బ్యానర్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి సూపర్ స్టార్స్ ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. జయకృష్ణ కి కూడా ఈ బ్యానర్ అదే రేంజ్ లో కలిసొస్తుందో లేదో చూడాలి.


