Ananya Panday
Ananya Panday : ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే(Chunky Pandey) కూతురుగా వెండితెర అరంగేట్రం చేసిన అనన్య పాండే,(Ananya Pandey) ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందం, యాక్టింగ్ టాలెంట్ ఉన్నప్పటికీ, ఈమెకు బాలీవుడ్ లో సరైన సూపర్ హిట్స్ లేవు. తెలుగు లో ఈమె విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘లైగర్’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయమైంది. ఈ సినిమా ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అనన్య పాండే కి ఈ సినిమా ద్వారా కూడా యాక్టింగ్ విషయం లో విమర్శలు ఎదురు అయ్యాయి. అందుకే ఆమెకు మన టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు కానీ, బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే ఉంది.
Also Read : ఆ యంగ్ హీరో కోసం 1000 కోట్ల సినిమాని వదిలేసుకున్న లైగర్ బ్యూటీ అనన్య పాండే..మరీ ఇంత ప్రేమ ఎందుకో!
ఇదంతా పక్కన పెడితే అనన్య పాండే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్న పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లోనే ఈమె ఇషాన్ , కార్తీక్ ఆర్యన్ వంటి హీరోలతో డేటింగ్ చేసింది. కానీ అతి తక్కువ సమయంలోనే బ్రేకప్ అయ్యింది. కానీ ఈమె ఆశికీ 2 ఆదిత్య రాయ్ కపూర్(Aditya Roy Kapoor) తో మాత్రం చాలా సీరియస్ రిలేషన్ ని మైంటైన్ చేసిందట. అతనే తన సర్వస్వం, తన లోకం గా భావించిందట. ఏ రిలేషన్ లో కూడా గొడవలు లేకుండా ఉండవు, అలా వీళ్లిద్దరి విషయం లో కూడా అనేక గొడవలు జరిగాయట, కానీ ప్రతీ సారి ఆమెనే తగ్గేదట. అంతలా ప్రేమించిన అబ్బాయిని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో చాలా ఎమోషనల్ గా చెప్పిందో అనన్య.
ఆమె మాట్లాడుతూ ‘ఒకరిని ప్రేమించినప్పుడు సమస్తం తానే అనుకోవడం నాకు అలవాటు. అలా ఒకరిని నేను ఎంతో ఇష్టపడ్డాను. అతనిలో నచ్చనివి చాలా ఉన్నాయి, కానీ నేను మాత్రం అతనిలో మంచి లక్షణాలను మాత్రమే చూసి కాంప్రమైజ్ అయ్యే దానిని. కానీ మా రిలేషన్ లో అది నా వైపు నుండి మాత్రమే ఉంది కానీ, అతని వైపు నుండి అదే తరహా ప్రేమ లేదు. ఎంతలా ప్రేమించామో, అదే ప్రేమని తిరిగి కోరుకోవడంలో తప్పు లేదు కదా, చాలా కాలం వరకు సహనం గా భరించాను, చివరికి తట్టుకోలేక బ్రేకప్ చెప్పాను’ అంటూ చెప్పుకొచ్చింది అనన్య పాండే. ఆమె ఆదిత్య రాయ్ కపూర్ పేరు ని బహిరంగంగా బయట చెప్పలేదు కానీ, అతన్ని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ అని అందరికీ అర్థమైంది. ప్రస్తుతం ఆమె వాకర్ బ్లాంకో అనే వ్యక్తితో డేటింగ్ చేస్తుంది.
Also Raed : సచిన్ టెండూల్కర్ అల్లుడితో ప్రేమాయణం పై మొట్టమొదటిసారి స్పందించిన ‘లైగర్’ బ్యూటీ!