Vaibhav Suryavanshi : 49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్ కు 75 పరుగులు.. అయ్యర్ తో కలిసి మూడో వికెట్ కు 60 పరుగులు.. ఇదీ మూడవ టి20 మ్యాచ్లో జింబాబ్వే మీద వైభవ్ సూర్య వంశీ విధ్వంసం.
జింబాబ్వే జట్టుతో జరిగిన మూడు టి20 మ్యాచ్ల సిరీస్ లో అవకాశం రాగానే సూర్యవంశీ అదరగొడతాడు అని అందరూ అనుకున్నారు. తిరుగులేని స్థాయిలో బ్యాటింగ్ చేస్తాడని భావించారు. దానికి తగ్గట్టుగానే అతడు బ్యాటింగ్ చేశాడు. రెండవ మ్యాచ్ మినహా.. మిగతా రెండు మ్యాచ్ లలో అతడు సత్తా చూపించాడు. తొలి మ్యాచ్ లో 19 బంతులు ఎదుర్కొని.. 50 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు.. నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రెండవ మ్యాచ్ లో తొమ్మిది బంతులలో 20 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు.. ఒక సిక్సర్ ఉంది. ఇక మూడో మ్యాచ్లో 49 బంతులు ఎదుర్కొని 81 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
మూడో మ్యాచ్లో అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత సూర్య వంశీ తన విశ్వరూపం చూపించాడు. బౌండరీలతో హరారే మైదానాన్ని హోరెత్తించాడు. జింబాబ్వే బౌలర్ల మీద సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఏమాత్రం కనికరం లేకుండా బ్యాటింగ్ చేశాడు. అతడి జోరు చూస్తే కచ్చితంగా సెంచరీ చేస్తాడని అభిమానులు భావించారు. అయితే ఊహించని విధంగా మద్వారే బౌలింగ్ లో ఎవాన్స్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఉన్నంత సేపు మైదానంలో వీర విహారం చేశాడు.
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక అభిషేక్ విఫలమవుతుంటే.. సూర్య వంశీ మాత్రం తన బ్యాటింగ్ స్టైల్ రోజురోజుకు మార్చుకుంటున్నాడు. కఠినమైన బంతులకు రెస్పెక్ట్ ఇస్తూ.. లూజ్ బంతులకు సరైన పనిష్మెంట్ ఇస్తున్నాడు. తద్వారా తన పేరు మీద అనేక రికార్డులను నమోదు చేసుకుంటున్నాడు. ఇక ఈ మ్యాచ్లో సూర్య వంశీ కొట్టిన కొట్టుడు బంతి స్టేడియం అవతల పడింది. అది చూసేందుకు పెద్ది సినిమా లాగా కనిపించింది. సూర్యవంశీ బ్యాటింగ్ చేస్తుంటే పెద్ది సినిమా రిపీట్ అయిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
Vaibhav sooryavanshi, you are amazing.
What a beautiful Shot. pic.twitter.com/8O46HhGkYl
— TheFakeFakeer (@TheFakeFakeer) July 26, 2026


