Homeజాతీయ వార్తలుSukesh Chandrasekhar: సుఖేష్ లీక్స్: ఎవరా ఎమ్మెల్సీ,₹ 15 కోట్లు ఎవరికిచ్చాడు?

Sukesh Chandrasekhar: సుఖేష్ లీక్స్: ఎవరా ఎమ్మెల్సీ,₹ 15 కోట్లు ఎవరికిచ్చాడు?

Sukesh Chandrasekhar
Sukesh Chandrasekhar

Sukesh Chandrasekhar: ఆర్థిక నేరాలకు సంబంధించి ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేస్తున్న లేఖలు సంచలనం సృష్టిస్తున్నాయి.. ఇటీవల ఆయన విడుదల చేసిన లేఖలో సంచలన విషయాలు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం ద్వారా భారత రాష్ట్ర సమితి నాయకులకు 75 కోట్ల లంచం ఇచ్చాడని సుఖేష్ బాంబు పేల్చాడు.. మరి కొద్ది రోజుల్లో మరో సంచలన లేఖను బయట పెడతా అన్నట్టుగానే.. తన లాయర్ అనంత్ ద్వారా బయటకు విడుదల చేశాడు.

రెండవ లేఖలో తాను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచనతో పదిహేను కిలోల నెయ్యి ( వారి పరిభాషలో కిలో అంటే కోటి, నెయ్యి అంటే నగదు) ని హైదరాబాదులోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ పార్కు చేసిన బ్లాక్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ 6060 నెంబర్ గల కారులో ఏపీ అంటే అరుణ్ పిళ్లై సహచరుడికి ఇచ్చానని సుఖేష్ వివరించారు. అంతేకాదు ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ నకు భారత రాష్ట్ర సమితి కీలక నేత, అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్రజైన్ కీలకపాత్ర పోషించారని సుఖేష్ స్పష్టం చేశాడు. అంతేకాదు తనకు భారత రాష్ట్ర సమితి సీనియర్ నేతకు జరిగిన వాట్సాప్ చాట్ హిస్టరీని మొత్తం ఆ లేఖలో వెల్లడించాడు. అంతేకాదు భారత రాష్ట్ర సంధి కార్యాలయంలో 15 కోట్లు అందజేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల గురించి ఆ వాట్సాప్ చాట్ లో ఉందని సుఖేష్ చెబుతున్నాడు. మరోవైపు తన వద్ద ఉన్న 703 చాట్ లలో ఇది శాంపిల్ మాత్రమేనని, ముందు ముందు చాలా విడుదల చేస్తానని సుఖేష్ స్పష్టం చేశాడు.

Sukesh Chandrasekhar
Sukesh Chandrasekhar

అయితే విడుదల చేసిన లేఖలో ఏపీ అంటే మద్యం కేసులో అరుణ్ రామచంద్ర పిల్లై అని, అంతేగాక ఆ కారు ముందు అద్దంపై ఎమ్మెల్సీ అనే స్టిక్కర్ కవిత పేరును సూచిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.. కవిత సౌత్ గ్రూపునకు నాయకత్వం వహించిందని ఈడీ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నది.. అంతేకాదు పలుమార్లు సౌత్ గ్రూపునకు చెందిన వారితో సమావేశాలు నిర్వహించిందని అప్పట్లో వివరించింది. అయితే తాజాగా సుఖేష్ లేఖ తో రాజకీయ వర్గాల్లో కలకలం నెలకొన్నది.

అయితే తన వద్ద ఢిల్లీ ముఖ్యమంత్రి, సౌత్ గ్రూప్ ను లీడ్ చేసిన ముఖ్యమైన వ్యక్తి తో జరిపిన చాట్ హిస్టరీ ఉందని సుఖేష్ చెబుతున్నాడు. దీనిని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల అనుమతితో బయటపెడతా అని అంటున్నాడు. ఒకవేళ ఇది గనుక బయటికి వస్తే పెద్ద పెద్ద వారి జాతకాలు మొత్తం మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మొన్నటిదాకా హడావిడి చేసిన ఈ డి.. తాజా ఆధారాలతో మరింత దూకుడుగా వెళ్లవచ్చని అంచనా వేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గడ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భారీ కుదుపులకు కారణమవుతుందని అంటున్నారు. అయితే ఈ వాట్సప్ హిస్టరీని మొత్తం సోమవారం విడుదల చేస్తానని సుఖేష్ అంటున్నాడు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
Exit mobile version