Homeక్రీడలుTeam India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు 1000కి పైగా రోజులు టీమిండియా టి20 నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. ఎప్పుడైతే గంభీర్ సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టాడో అప్పుడే పరిస్థితి మారిపోయింది. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్ లలో టీమిండియా కు ఓటమి ఎదురైంది. ఏకంగా వైట్ వాష్ కు గురైంది.

టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత టీమిండియా ఈ స్థాయిలో ఓటములు ఎదుర్కోవడంతో నెంబర్ వన్ స్థానం కాస్త.. నెంబర్ టూ కు పడిపోయింది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో.. అంతకుముందు రోహిత్ నాయకత్వంలో టీమిండియా టి20 ఫార్మాట్లో బ్రహ్మాండంగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. గంభీర్ చేపట్టిన పనికిమాలిన ప్రయోగాల వల్ల టీమిండియా మొదటి స్థానాన్ని కోల్పోయింది. ఆటగాళ్లు కూడా సక్రమంగా ఆడలేకపోయారు.

ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే జట్టుతో టి20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచింది. మూడో మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ మొత్తాన్ని వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియాకు ఒక గుడ్ న్యూస్ లభించింది. ఐర్లాండ్.. ఇంగ్లాండ్ సిరీస్ లు కోల్పోయి.. తీవ్ర విమర్శల పాలైన టీమ్ ఇండియా.. జింబాబ్వే జట్టు మీద సిరీస్ గెలిచి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. ఏకంగా నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది

జింబాబ్వేతో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో టీమిండియా ఏకంగా 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ భారీ అంతరంతో విజయం సాధించిన నేపథ్యంలో టీమిండియా ర్యాంక్ మెరుగుపడింది. నిన్నటిదాకా రెండో స్థానంలో ఉన్న టీం ఇండియా. ఇప్పుడు ఏకంగా మొదటి స్థానంలోకి వచ్చింది. అయితే భారత జట్టుతో పాటు.. ఇంగ్లాండ్ కూడా 268 పాయింట్లతో కొనసాగుతోంది.

జింబాబ్వే సిరీస్ లో టీమిండియా కు శిక్షకుడిగా తెలుగోడు వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తున్నాడు. ఇతడి శిక్షణలో టీమిండియా తిరుగులేని స్థాయిలో ఆట తీరు ప్రదర్శించింది. ఇప్పటివరకు ఒకే ఒక సిరీస్ కోల్పోయింది. అది కూడా న్యూజిలాండ్ మీద.. వివిఎస్ లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీమ్ ఇండియాకు ఓటమి అనేది లేకుండా పోయింది.. అందువల్లే గౌతమ్ గంభీర్ ను పక్కనపెట్టి.. వీవీఎస్ లక్ష్మణ్ కు కోచ్ బాధ్యత అప్పగించాలని అభిమానులు కోరుతున్నారు..

గౌతమ్ గంభీర్ ఉన్నప్పుడు టీమిండియా రెండవ స్థానానికి పడిపోయిందని.. ఇప్పుడు గౌతమ్ జట్టుకు దూరంగా ఉన్నప్పుడు.. ర్యాంక్ మారిందని.. దీనిని బట్టి టీమ్ ఇండియాకు శని ఎవరో అర్థం చేసుకోవచ్చని.. అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా మేనేజ్మెంట్ కోచ్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలని.. జట్టుకు అనుకూలమైన విధానాన్ని రూపొందించాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Oktelugu Epaper
Exit mobile version