Homeఎంటర్టైన్మెంట్Ram Charan- Susmitha: ఇప్పటికే నలుగురున్నారు... చరణ్ కి పుట్టబోయే బిడ్డపై అక్క సుస్మిత షాకింగ్...

Ram Charan- Susmitha: ఇప్పటికే నలుగురున్నారు… చరణ్ కి పుట్టబోయే బిడ్డపై అక్క సుస్మిత షాకింగ్ కామెంట్స్..!

Ram Charan- Susmitha: చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు. గత ఏడాది చివర్లో చిరంజీవి ఈ శుభవార్త తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇది మెగా అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నింపింది. రామ్ చరణ్ కి వివాహమై 10 ఏళ్ళు దాటిపోయింది. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. ఏళ్ళు గడిచిపోతుంటే చరణ్ పిల్లల్ని కంటారా? లేదా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలకు, అపోహలకు చరణ్ దంపతులు చెక్ పెట్టారు. మరి కొద్ది నెలల్లో రామ్ చరణ్, ఉపాసనల జీవితంలోకి కొత్త సభ్యుడు వస్తున్నాడు.

Ram Charan- Susmitha
Ram Charan- Susmitha

చరణ్ తండ్రి కావడం కుటుంబ సభ్యులకు ఎక్కడ లేని సంతోషం తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ అక్క గారైన సుస్మిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చరణ్ తండ్రి కాబోతున్నాడు. ఇది మా కుటుంబంలో అతి పెద్ద పండగ. పాప, బాబు ఎవరు పుట్టినా సంతోషమే. అయితే అబ్బాయి పుడితే బాగుండు. మా ఫ్యామిలీలో ఇప్పటికే నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అందుకే ఈసారి అబ్బాయి కావాలనిపిస్తుందని సుస్మిత అన్నారు.

కాగా సుస్మిత సైతం చిత్ర పరిశ్రమలో సెటిల్ అయ్యారు. తండ్రి చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. సైరా, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో చిరంజీవి కాస్ట్యూమ్స్ సుస్మిత డిజైన్ చేసినవే. అలాగే నిర్మాతగా కొన్ని చిత్రాలు, సిరీస్లు తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి సినిమా వారసత్వాన్ని సుస్మిత ఆ విధంగా కొనసాగిస్తున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సుస్మిత అద్భుతంగా మాట్లాడారు.

Ram Charan- Susmitha
Ram Charan- Susmitha

వాల్తేరు వీరయ్య లో చిరంజీవికి వింటేజ్ లుక్ రావడానికి ఆమె రూపొందించిన కాస్ట్యూమ్స్ కారణమయ్యాయి. వాల్తేరు వీరయ్య మూవీ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుతూ… డైరెక్టర్ బాబీ నాకు చిరంజీవి వింటేజ్ లుక్ కావాలి అన్నారు. అందుకు అనుగుణంగా బట్టలు రూపొందించామన్నారు. మేము చిన్నప్పటి నుండి నాన్నగారి సినిమాలు చూసి పెరిగాము. అందుకే పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదు. మా పని ఈజీగానే పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. జనవరి 13న వరల్డ్ వైడ్ విడుదలైన వాల్తేరు వీరయ్య పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అద్భుతమైన ఓపెనింగ్స్ రాబట్టింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper