Homeఆంధ్రప్రదేశ్‌Sankranthi Kodi Pandalu: పోలీస్ వ‌ర్సెస్ పొలిటిక‌ల్.. కాక‌రేపుతున్న కోడి పందాలు !

Sankranthi Kodi Pandalu: పోలీస్ వ‌ర్సెస్ పొలిటిక‌ల్.. కాక‌రేపుతున్న కోడి పందాలు !

Sankranthi Kodi Pandalu: కోన‌సీమ‌లో కోడి పందాలు కాక‌రేపుతున్నాయి. పోలీస్ వ‌ర్సెస్ పొలిటిక‌ల్ గా కోడి పందాలు మారాయి. కోడి పందాలు చ‌ట్ట వ్య‌తిరేకమ‌ని పోలీసులు చెబుతుంటే.. అనాదిగా వ‌స్తున్న సంప్ర‌దాయ‌మ‌ని పొలిటిక‌ల్ బాస్ లు చెబుతున్నారు. చ‌ట్టాన్ని అమ‌లు చేయాలా ?… పొలిటిక‌ల్ బాస్ ల మాట‌కు త‌లొగ్గాలా ? అన్న సందిగ్ధం పోలీసు వ‌ర్గాల్లో నెల‌కొంది.

Sankranthi Kodi Pandalu:
Sankranthi Kodi Pandalu:

సంక్రాంతి మూడు రోజులూ కోన‌సీమ‌లో కోడిపందాలు య‌థేచ్చ‌గా జ‌రుగుతాయి. కోట్ల రూపాయాలు చేతులు మారుతాయి. పొరుగురాష్ట్రాల నుంచి వేలాది మంది త‌ర‌లివ‌స్తారు. కానీ ప్ర‌తి యేటా లాగానే ఈసారి కూడ పోలీసు ఆంక్ష‌లు పందెం నిర్వాహ‌కుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పొలిటిక‌ల్ బాస్ లు మాత్రం మేమున్నాం అంటూ అభ‌య‌మిస్తే.. పోలీస్ బాస్ మాత్రం మీ ఆట‌లు సాగనివ్వం అంటూ హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సంక్రాంతి బ‌రిలో కోడిపుంజులు నిలుస్తాయా ? .. లేదా ? అన్న అనుమానం మొద‌లైంది.

“కోన‌సీమ సంప్ర‌దాయాల‌కు అడ్డుప‌డొద్దు. ఎప్ప‌టిలాగే జ‌ర‌గ‌నివ్వండి. రాష్ట్రంలో ఎక్క‌డా ఏ స‌మ‌స్యా లేదు. ఒక్క కోన‌సీమ‌లోనే ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వ్య‌వ‌హార శైలి వివాదాస్ప‌దంగా ఉంది“ అంటూ పొలిటికల్ బాస్ లు పోలీస్ బాస్ పై పెద‌వి విరిచారు. అంత‌లోనే మంత్రి విశ్వ‌రూప్ ఇంట్లో తోట త్రిమూర్తులు, రాపాక వ‌ర‌ప్ర‌సాద్, చీర్ల జ‌గ్గిరెడ్డిలు స‌మావేశ‌మ‌య్యారు. కోడి పందెం నిర్వ‌హిస్తార‌ని, పోలీసులు అడ్డుకోవ‌ద్దంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో పోలీసుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఒక‌వైపు చ‌ట్టం, మ‌రోవైపు అధికార పార్టీ ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

Sankranthi Kodi Pandalu:
Sankranthi Kodi Pandalu:

అధికార పార్టీ అధిష్టానం నుంచి అన‌ధికార గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింద‌ట‌. దీంతో అధికార పార్టీ నేత‌లు బ‌రులు సిద్ధం చేస్తున్నార‌ట‌. కోడి పందేలు నిర్వ‌హించేందుకు త‌గిన ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌. భోగి రోజు నుంచే కోడి పందేల నిర్వ‌హ‌ణ‌కు స్థానిక నేత‌లు క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ట‌. కేవ‌లం మూడు రోజులు మాత్ర‌మే పోలీసులు చూసిచూడ‌న‌ట్టు ఉండే అవ‌కాశం ఉంది. ఆ త‌ర్వాత కూడ కొన‌సాగితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది. ఏది ఏమైనా ఈ యేడు కూడ కోడి పుంజులు సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌బోతున్నాయి.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper