Viral Video: అమ్మాయి కొంటెగా ఒక్క చూపు చూసిందంటే చాలు అబ్బాయిలు పడి చచ్చిపోతారు. ఎంతటి అందగాడైనా.. ఎంత పెద్ద మొనగాడైనా అమ్మాయి చూపులకు పడిపోవాల్సిందే. ఆ చూపులో ఏం మాయ ఉంటుందో గానీ.. ఆడవారు కేవలం తమ చూపులతోనే కంట్రోల్ చేసేంత పవర్ సాధించారు. బయట ఎంత పెద్ద తోపు అయినా.. అమ్మాయి దగ్గరకు వచ్చే సరికి అందరూ ఒకింత తగ్గాల్సిందే.

కాగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో పెండ్లికి సంబంధించిన వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెండ్లి అంటేనే డ్యాన్సులు, సరదాలు, ఆటపట్టించడాలు ఇలా అనేకం ఉంటాయి. ఈ నడుమ పెండ్లిలో జరిగే కొన్ని చిలిపి సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు అయితే బాగా పాపులర్ అవుతున్నాయి.
Also Read: జాతీయ రాజకీయాల కోసం ఈసారి ఎంపీగా పోటీ చేయనున్న కేసీఆర్ !?
కాగా ఇప్పుడు కూడా ఓ క్యూట్ వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. దాన్ని చూసిన వారంతా కూడా ప్లాట్ అయిపోతున్నారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఆ వీడియో చూశాక తెగ మురిసిపోతున్నారు. ఈ వీడియోలో ఓ పెండ్లి వేడుక దగ్గర అందరూ భోజనాలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వధూ, వరులు ఇద్దరూ కూడా ఒకే చోట కూర్చుని చక్కగా భోజనం చేస్తున్నారు.
View this post on Instagram
అయితే మధ్యలో వరుడు తన పక్కనే ఉన్న వధువు ప్లేట్ లోని పూరీని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది గమనించిన వధువు రొమాంటిక్ గా ఒక్క చూపు చూస్తుంది దెబ్బకు అతను పూరీని అక్కడే పెట్టేస్తాడు. అంటే వధువు కేవలం తన చూపులతోనే అబ్బాయిని కంట్రోల్ చేసేసిందన్న మాట. ఎలాంటి డైలాగులు ఇందులో లేవు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దాన్ని చూసిన వారంతా కూడా అమ్మాయి ఎక్స్ ప్రెషన్స్ అదుర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి లేటెందుకు మీరు కూడా చూసేయండి ఆ క్యూట్ వీడియోను.
Also Read: మూడో కూటమి ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు ఫలించేనా?
Recommended Video: