spot_img
Homeఎంటర్టైన్మెంట్Meena Daughter Speech: మా అమ్మ కూడా మనిషే, ఆమెకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి... కన్నీరు...

Meena Daughter Speech: మా అమ్మ కూడా మనిషే, ఆమెకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి… కన్నీరు పెట్టిస్తున్న మీనా కూతురు వీడియో!

Meena Daughter Speech
Meena Daughter Speech

Meena Daughter Speech:  నటిగా మీనా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రస్థానం మొదలుపెట్టిన మీనా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సౌత్ ఇండియాలో తిరుగులేని నటిగా వందల చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో మీనా స్టార్డం అనుభవించారు. ఈ క్రమంలో కోలీవుడ్ ఆమెకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. రజినీకాంత్ తో పాటు పలువురు కోలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేదికపై మీనా కూతురు నైనిక అమ్మ గురించి మాట్లాడిన ఓ వీడియో ప్లే చేశారు. ఆ వీడియోలో నైనిక ముద్దుముద్దుగా మాట్లాడారు.

అమ్మ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నేను నిన్ను సంతోషంగా చూసుకుంటాను. నాన్న చనిపోయాక నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళావు. నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. నువ్వు ఎల్లవేళలా నన్ను సురక్షితంగా చూసుకున్నావు. ఒకసారి నీకు చెప్పకుండా పక్క షాపుకి వెళ్లి చాక్లెట్స్ తిన్నాను. అప్పుడు నువ్వు ఎంత భయపడ్డావో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు అమ్మ గురించి తప్పుడు వార్తలు రాశాయి. మా అమ్మ కూడా మనిషే. ఆమెకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి అలా రాయకండి… నైనిక ఆ వీడియోలో అన్నారు.

నైనిక తన మాటలతో రజినీకాంత్ తో పాటు పలువురుని ఎమోషనల్ అయ్యేలా చేసింది. 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విద్యా సాగర్ ని మీనా వివాహం చేసుకున్నారు. గత ఏడాది ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. భర్త మరణం మీనాను దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం మీనా రెండో వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు మీనాను బాధ పెట్టినట్లు కూతురు నైనిక మాటలతో అర్థం అవుతుంది.

ఇటీవల మీనా పలు చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ ఆమె సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ స్థాయి పాత్రలు చేయడం విశేషం. దృశ్యం మలయాళ, తెలుగు సిరీస్లలో ఆమె నటించారు. మోహన్ లాల్, వెంకటేష్ లతో జతకట్టారు. అన్నాత్తే చిత్రంలో రజినీకాంత్ పక్కన తళుక్కున మెరిశారు. గత ఏడాది మీనా నటించిన బ్రో డాడీ, సన్ ఆఫ్ ఇండియా చిత్రాలు విడుదలయ్యాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper