Sunny Leone Flexi: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు పెద్దలు. కొందరి ఆలోచనలు చాలా వినూత్నంగా ఉంటాయి. కాగా పల్లెటూళ్లలో ప్రజలకు మూఢ నమ్మకాలు ఎక్కువ. వాటిలో నరదృష్టి ఒకటి. అందమైన కొత్త ఇల్లు కన్నుకున్నారు ఇంటికి ఎదురుగా పెద్ద దిష్టి బొమ్మ పెడతారు. ఆ బొమ్మ జనాల దృష్టిని ఆకర్షించి తమ ఇంటిపై కన్నుపడకుండా చేస్తుందని నమ్ముతారు. నరదృష్టి చెడు చేస్తుందని మూఢ భావన. ఇక పంట పొలాల్లో కూడా ఈ దిష్టి బొమ్మలు మనం చూడవచ్చు. అందవికారంగా ఉండే మనిషంత ఎత్తు దిష్టిబొమ్మలు పొలాల మధ్యలో రైతులు ఏర్పాటు చేస్తారు. అది చీడ పీడల నుండి నరదిష్టి నుండి కాపాడుతుందని నమ్ముతారు.

అయితే దీనికి భిన్నంగా ఆలోచించాడు ఒక రైతు. దిష్టి బొమ్మల ట్రెండ్ ఓల్డ్ అయిపోయిందని హాట్ సెక్సీ ఫ్లెక్సీలతో న్యూ ట్రెండ్ స్టార్ట్ చేశాడు. తెలంగాణ మిర్యాలగూడకు చెందిన రైతుకు రహదారిని అనుకోని రెండెకరాల పొలం ఉంది. దాంట్లో మిర్చి పంట వేశాడు. మిర్చి ఇరగ కాయడంతో దారిన వెళ్లే ప్రతి ఒక్కరి కన్ను చేనుపై పడుతుంది. ఇది గమనించిన రైతులు దారిన వెళ్లే జనాల దృష్టి తన పొలం పడకుండా చేయాలి అనుకున్నాడు.
దీని కోసం టూ పీస్ బికినీలో ఉన్న సన్నీ లియోన్ ఫోటోలు ఏర్పాటు చేశారు. ఆ దెబ్బతో రోడ్డున వెళ్లే వాళ్ళు పొలాన్ని చూడకుండా సన్నీ లియోన్ ని చూస్తూ రైతు వేసిన మిర్చి పంట గురించి మాట్లాడుకోవడం లేదు. మెయిన్ రోడ్డు ప్రక్కన కావడంతో ఈ విషయం ఊరంతా వ్యాపించింది. మీడియా దృష్టికి కూడా వెళ్ళింది. సదరు రైతును మీడియా ప్రతినిధులు ఇలా ఎందుకు చేశావని అడగ్గా… బాగా పండిన నా చేనుకు నరదిష్టి తగలకుండా సన్నీ లియోన్ ఫోటోలు పెట్టానని చెప్పుకొచ్చాడు.

ఆ రైతు ఆలోచన నచ్చిన మరికొందరు రైతులు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. రైతు పంటకు దిష్టి తగలకుండా సన్నీ లియోన్ సహాయం తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే దీనిపై మహిళలు నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మిర్చి పొలాల్లో పనులు చేసేందుకు వచ్చే మహిళా కూలీలు ఈ అర్థనగ్న ఫోటోలు చూసి ఇబ్బంది పడుతున్నారట. సన్నీ లియోన్ ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారట.