Allu Arjun Arrested: అల్లు అర్జున్ నేడు అరెస్ట్ అయ్యారు. చిక్కడపల్లి పోలీస్టేషన్ కి అల్లు అర్జున్ ని తీసుకెళ్లారు. కాగా అల్లు అర్జున్ పోలీసుల పై ఫైర్ అయ్యారు. బెడ్ రూమ్ లోకి కూడా వచ్చేస్తారా? అని మండిపడ్డారట. కనీసం బట్టలు మార్చుకుంటానని చెప్పినా పోలీసులు సమయం ఇవ్వలేదట. నేరుగా మా బెడ్ రూమ్ కి వచ్చేస్తారా అని అల్లు అర్జున్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశాడట. కాగా డిసెంబర్ 4న అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వెళ్లారు. థియేటర్ లో అభిమానులతో పుష్ప 2 సినిమా చూశాడు. అల్లు అర్జున్ రాకతో ఆ ప్రాంతం జనసంద్రమైంది. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ఒక వివాహిత కన్నుమూసింది. ఆమె కుమారుడు సైతం అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. బాలుడికి చికిత్స జరుగుతుంది. మహిళ అక్కడికక్కడే ప్రాణం వదిలింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్ తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు. కాగా నేడు అల్లు అర్జున్ ని కూడా అరెస్ట్ చేశారు. 105,118(1) ఆర్/డబ్య్లు బి ఎం ఎస్ 3/5 సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో సంధ్య థియేటర్ సంచలన లేఖ విడుదల చేసింది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పుష్ప 2 హీరోతో పాటు ప్రముఖులు సంధ్య థియేటర్ కి వస్తారు. కావున బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు లేఖ రాశారు. అల్లు అర్జున్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని పోలీసులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది. మరోవైపు అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు పూర్తి చేసిన పోలీసులు, నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు.
మరోవైపు పుష్ప 2 తో దేశంలోనే అతిపెద్ద స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగాడు. పుష్ప 2 కేవలం ఆరు రోజుల్లో రూ. 1000 కోట్ల వసూళ్ల మార్క్ చేరుకుంది. పుష్ప 2 విజయాన్ని అల్లు అర్జున్ ఆస్వాదించలేకున్నాడు. త