Allu Arjun arrested : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి లేనంత గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు అల్లు అర్జున్… ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు సంధ్య తియేట కి వెళ్ళినప్పుడు రేవతి అనే ఆవిడ తొక్కిసలాటలో చనిపోయింది. ఇక ఆ కేసు అల్లు అర్జున్ మీద ఫైల్ అయింది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనను కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ అరెస్టు వెనక చాలా రాజకీయ కుట్రలు కూడా జరుగుతున్నాయి అంటూ కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రేవతి చనిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రొటక్షన్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది. బట్ అది మాత్రం వాళ్ళు ఒప్పుకోకుండా కేవలం అల్లు అర్జున్ మీద నెట్టేసి ఆయనదే తప్పు అన్నటుగా చూపించుకుంటున్నారు కారణం ఏదైనా కూడా అల్లు అర్జున్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి పాన్ ఇండియాలో తన సత్తా చాటుతూ వస్తున్నాడు. కాబట్టి ఆయన ఎవరి అండ దండ లేకుండా ఎదుగుతున్నాడనే ఒక ఈర్షతో అతన్ని తొక్కేయాలని చాలా రోజుల నుంచి చాలామంది కుట్రలు పన్నుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని అందుకున్నాడు. ఇక ఇది కూడా చాలామందికి నచ్చలేదు. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవరికి ‘నేషనల్ అవార్డు’ రాలేదు. కాబట్టి తనకు మాత్రం వచ్చిందనే ఉద్దేశ్యం తోనే ఆయన్ని తొక్కేయాలనే చూశారు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన 2024 లో జరిగిన ఎలక్షన్స్ లో వైసీపీ పార్టీ నంద్యాల అభ్యర్థికి సపోర్టు చేయడం ఇతర హీరోల అభిమానులకి నచ్చలేదు. దానికి కారణం ఏదైనా కూడా ఆయన తనను నమ్మిన వాళ్లకి అండగా నిలుస్తానని చెప్పాడు. కానీ అది కూడా మింగుడు పడని కొంతమంది రాజకీయ నేతలు హీరోలు కలిసి అతన్ని తొక్కేసే ప్రయత్నం అయితే ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు అవకాశం దొరికింది కాబట్టి ఇప్పుడు అందరి ప్రతాపాన్ని చూపిస్తూ తొక్కేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు ఆయన పాన్ ఇండియా నే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ కి కూడా దూసుకెళ్తున్నాడు. ఆయన ఎదుగుతుండడం సహించని చాలా మంది అతని మీద కుట్రని పన్ని ఇలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ విషయం నాన్ బెయిలేబుల్ కేసును పెట్టడం కూడా ఆయన మీద కొంతమంది కుట్రను పన్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది