Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ అమ్మాయిలతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ బ్యూటీస్ అరియనా, అషురెడ్డిలతో గతంలో ఈ తరహా ఇంటర్వ్యూలు చేశారు. అరియనా జిమ్ ఫిట్ ధరించగా… వ్యాయామశాలలో ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఆమె అంగాంగ సౌందర్యాన్ని వర్ణించాడు. నీ బాడీలో నాకు ఆ ప్రైవేట్ పార్ట్ ఇష్టం అంటూ పబ్లిక్ గా చెప్పేశాడు. జిమ్ చేసే అలవాటు లేకుండా ఇంత పర్ఫెక్ట్ ఫిగర్ మైంటైన్ చేయడం కష్టం అంటూ కొనియాడారు. అప్పట్లో ఆ ఇంటర్వ్యూ వైరల్ అయ్యింది.

అనంతరం మరో బిగ్ బాస్ భామ అషురెడ్డిని ఇంటర్వ్యూ చేశాడు. కాఫీ షాప్ లో ఒంటరిగా కూర్చున్న అషురెడ్డి దగ్గరకు వెళ్లిన వర్మ ‘నీ థైస్ బాగున్నాయి అంటాడు’ కోపంతో అషురెడ్డి వర్మ చెంపపై కొడుతుంది. కొట్టినా పర్లేదు, నీ చేయి నన్ను తాకిందని సంతోషపడతాను అంటూ… వర్మ సంతోషపడతాడు. ఒక అపరిచితుడికి అందమైన అమ్మాయికి మధ్య జరిగిన శృంగార సంభాషణ వలె ఆ ఇంటర్వ్యూ రూపొందించారు.
తాజాగా అషురెడ్డి-వర్మ మరో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈసారి ఇంకొంచెం పచ్చిగా వీరి ఇంటర్వ్యూ సాగింది. అషురెడ్డిలో తనకు థైస్ ఇష్టమని వర్మ చెప్పాడు. చైర్ లో కూర్చుంటే కళ్ళను మాత్రమే చూడగలం. అందుకే నేను క్రింద కూర్చొని నీ థైస్ చూస్తాను. దేవుడు వరం ఇస్తే నేను నీ థైస్ కోరుకుంటాను అన్నాడు. అషురెడ్డి కాలిపై ముద్దు పెట్టాడు. కాలి వేళ్ళు నోట్లో పెట్టుకున్నాడు.

రాయలేని భాషలో అనేక పచ్చి విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. అషురెడ్డి ప్రేమ, పెళ్లి ప్రస్తావన తేవడంతో అసలు పెళ్లి చేసుకోవద్దని వర్మ సలహా ఇచ్చాడు. అవును పెళ్లి నాకు కూడా ఇష్టం లేదని అషురెడ్డి చెప్పారు. సెక్స్ ఎమోషన్ గొప్పదా? ప్రేమ ఎమోషన్ గొప్పదా? అనే చర్చకు రాగా… శృంగారం పది నిమిషాలు లేదా అరగంట చేస్తారు. కాబట్టి ప్రేమ ఎమోషన్ గొప్పది. అది ఎక్కువ కాలం నిలిచి ఉండే ఎమోషన్ అని అషురెడ్డి చెప్పింది. ఇంత దారుణమైన ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న అషురెడ్డిని పేరెంట్స్ మందలించడం లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి.