Manchu Lakshmi: సీనియర్ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఓ బోల్డ్ క్యారెక్టర్ చేశారు. ఆమె లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. స్టార్ కిడ్ మంచు లక్ష్మి ఇలాంటి శృంగార సన్నివేశాల్లో పాల్గొనడం హాట్ టాపిక్ అయ్యింది. దీని గురించి టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. మంచు లక్ష్మి ట్రోలింగ్ మెటీరియల్ గానే జనాలకు పరిచయం. అంతగా ఆమె ట్రోలింగ్ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఏళ్ల తరబడి అమెరికాలో ఉన్న మంచు లక్ష్మి ఇంగ్లీష్ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు. ఆమె యాక్సెంట్ అమెరికన్స్ కి దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలో మంచు లక్ష్మి మాట్లాడే తెలుగు ఫన్నీగా ఉంటుంది.

ఆమె తెలుగు మాట్లాడే విధానం ట్రోల్స్ కి గురవుతుంది. అలాగే మంచు లక్ష్మి వాళ్ళ నాన్నగారు మోహన్ బాబును చేసిన ఇంటర్వ్యూలు కొంచెం అతిగా ఉంటాయి. వాళ్ళను వాళ్లే ఎక్కడికో లేపుకోవడం జనాలకు నచ్చదు. సెల్ఫ్ డబ్బా అంటూ… ఈ యాంగిల్ లో కూడా మంచు లక్ష్మిని ట్రోల్ చేస్తూ ఉంటారు. ట్రోల్స్ కారణంగా మంచు లక్ష్మి ప్రతిభ గురించి చాలా మందికి తెలియదు.
ఆమె అమెరికాలో టెలివిజన్ హోస్ట్ గా పని చేశారు. ఒకటి రెండు ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. ఇండియాకు వచ్చాక ఆమె హీరోయిన్ కావాలని ఆశపడ్డారు. అయితే నెగిటివ్ రోల్ తో ప్రేక్షకులను పలకరించారు. ఆమె డెబ్యూ తెలుగు చిత్రం అనగనగా ఓ ధీరుడు. సిద్దార్థ్-శ్రుతి హాసన్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో ఆమె మంత్రగత్తెగా విలన్ రోల్ చేశారు. తర్వాత గుండెల్లో గోదారి, దొంగాట చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు.

మంచు హీరోలు మాదిరే ఆమెకు కూడా నటిగా బ్రేక్ రాలేదు. సొంత బ్యానర్లో చేసిన సినిమాలు ఢమాల్ అన్నాయి. తాజాగా మంచు లక్ష్మి ఒక పాత్రతో హైలెట్ అయ్యారు. మోహన్ లాల్ హీరోగా విడుదలైన మాన్స్టర్ మూవీలో మంచు లక్ష్మి లెస్బియన్ రోల్ చేశారు. ఒక అమ్మాయితో లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ సీన్స్ అంత వల్గర్ గా ఏమీ లేవు. అదే సమయంలో మంచు లక్ష్మి నటనలో తన టాలెంట్ చూపించింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమ్ అవుతుంది.