spot_img
Homeఎంటర్టైన్మెంట్Garikapaati Vs RGV : అనుష్కను చూసి టెంప్ట్ అయిన గరికపాటి.. ఏకిపారేసిన రాంగోపాల్ వర్మ,...

Garikapaati Vs RGV : అనుష్కను చూసి టెంప్ట్ అయిన గరికపాటి.. ఏకిపారేసిన రాంగోపాల్ వర్మ, బాబు గోగినేని

Garikapaati Vs RGV :  ఆరోజు దుర్మూహర్తం ఉందో.. లేక గడిచిన గడియ బాగాలేదో ఏమో కానీ.. చిరంజీవిని అవమానించి గరికపాటి నరసింహారావు అడ్డంగా బుక్కయ్యారు. స్టేజీపై చిరంజీవి ఆడవాళ్లతో సెల్ఫీలు ఆపకపోతే వెళ్లిపోతానన్న ఒక్క మాట గరికపాటికి మైనస్ అయ్యింది. ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రవచనాలతో గుర్తింపు పొందిన గరికపాటి లూప్ హోల్స్ వెతికి మరీ జనాలు ట్రోల్స్ చేస్తున్నారు.

ఇన్నాళ్లు నెటిజన్లకే పరిమితమైన ఈ ట్రోలింగ్ ఇప్పుడు ఏకంగా సెలబ్రెటీల వరకూ చేరింది. ప్రముఖ హేతువాది బాబు గోగినేనితోపాటు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. గరికపాటి పాత వీడియోలు షేర్ చేసి ఆయనను ఏకిపారేస్తున్నారు.

గతంలో గరికపాటి ఆడవాళ్లపై చేసిన కామెంట్ల వీడియోను షేర్ చేసిన హేతువాది బాబు గోగినేని… గరికపాటిని ఉతికి ఆరేశారు. ‘తమరు రాసుకెళ్లి పోవడం ఆడవాళ్లకు ఇష్టమా? పిల్లల తల్లులను కూడా వదలరా? ఒక వ్యక్తిని చూస్తే మీకు లైంగిక పరమైన ఆలోచన తప్ప ఇంకేమీ రాదా? మీ దృష్టి నుండి ఆడవాళ్లు తమని తాము ఎలా కాపాడుకోవాలో ఇక ఆలోచించాలా? తెలుగు తాలిబాన్ పనులు ఆపి కళ్లకు గంతలు కట్టుకోండి.’ అంటూ కామెంట్ చేయడమే కాకుండా దానికి రాంగోపాల్ వర్మను ట్యాగ్ చేశారు.

అసలు కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎలా ఉంటుందో ఇప్పుడు వర్మకు బాబు గోగినేని షేర్ చేసిన వీడియో అలా దొరికింది. వర్మ ఊరుకుంటాడా? దాన్ని పెంట పెంట చేశాడు. గతంలో ఇదే గరికపాటి అనుష్కపై చేసిన హాట్ కామెంట్ల వీడియోను వర్మ పోస్ట్ చేశాడు. అందులో ‘‘అనుష్క అందాల బికినీ ఫొటోను పేపర్లో చూసి తాను టెంప్ట్ అయ్యానని.. తానే కాగా లేనిది తమ కుమారుడు అలా అనుష్క ఫొటోను చూస్తుండడం చూసి వాడు కాడా? అనిపించదని’’ గరికపాటి స్వయంగా అన్న వీడియోను వర్మ షేర్ చేశాడు. దానికి ‘ఓహో మీకు కూడానా బాహు (గరిక) బలి గారు అంటూ ఎద్దేవా చేశారు. అహా అడ్డడ్డే అంటూ సెటైర్ వేశాడు.

ఇలా చిరంజీవితో మహిళలు ఫొటో దిగితేనే ఇంత కోప్పడ్డ గరికపాటిని.. గతంలో అనుష్కను చూసి టెంప్ట్ అయ్యానని చెప్పిన వీడియోను.. మహిళల లిప్ స్టిక్ లు అంగాంగ ప్రదర్శనలపై నోరుజారిన వీడియోలను బయటకు తీసి మరీ నెటిజన్లు, సెలబ్రెటీలు వాయించేస్తున్నారు. ఈ వివాదంలోకి వర్మ, బాబు గోగినేని సైతం చేరి ఆడవాళ్లపై ఇంతగా మాట్లాడుతున్న గరికపాటిపై మహిళా సంఘాలు , రాష్ట్ర, జాతీయ మహిళా కమిషన్లు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నిస్తున్నారు. పోయి పోయి చిరంజీవిని అని గరికపాటి చాలా పెద్ద తప్పు చేశాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు..

https://twitter.com/RGVzoomin/status/1580183164743733248?s=20&t=bm2XqeixxDHEROQw31bQAw

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Narendra Modi Strategy

Narendra Modi Strategy: ఢిల్లీ కాక్రోచ్‌లపై మోదీ హిట్‌ వ్యూహం.. దెబ్బకు దిగొచ్చిన ఆందోళనకారులు!

Narendra Modi Strategy: నీట్‌ పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో మొదలైన ఉద్యమం క్రమంగా దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీలో సీజేపీ నాయకత్వంలో సాగుతున్న ఈ ఆందోళనకు ఇతర రాష్ట్రాల్లో రాజకీయ...
SS Rajamouli

SS Rajamouli: వారణాసి బడ్జెట్ పెరగడం మీద స్పందించిన రాజమౌళి…

SS Rajamouli: మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మొదట 1000 కోట్ల బడ్జెట్ తో తీసేద్దాం అనుకోని ఈ సినిమాని...
Oktelugu Epaper