Jana Sena women leaders : వైసీపీ ప్రభుత్వానికి ఏపీలో పట్టపగ్గాల్లేకుండా పోతోంది.. అస్సలు అడిగే వాడే లేకుండా చేస్తున్న పరిస్థితి. ప్రశ్నించిన వారిని భయపెడుతూ హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు వాపోతున్నారు. ప్రతిపక్ష నేతలనే కాదు.. ఆఖరుకు మహిళలను ప్రశ్నించినా పోలీసులు అడ్డుకొని వారిపై ప్రతాపం చూపిస్తున్న దారుణం వెలుగుచూస్తోంది.

ఇప్పటికే ప్రతిపక్ష జనసేన నేతల ఆందోళలను, నిరసనలు ఉక్కుపాదంతో వైసీపీ సర్కార్ అణిచివేస్తోంది. ప్రశ్నించేవారిపై దాడులు, కేసులతో హింసిస్తోంది. జనసేన జెండా గద్దెల ఆవిష్కరణను కూడా అడ్డుకుంటోంది. ఆఖరుకు ప్రజాసమస్యలపై ఫ్లెక్సీలు, పోస్టర్లు, పవన్ పిలుపులను కూడా అంటిస్తే వారిని అడ్డుకుంటున్న దైన్యం నెలకొంది.
జనసేన పార్టీ ఫ్లెక్సీ కట్టిన వీర మహిళలను తాజాగా ఏపీ పోలీసులు అడ్డుకుంటున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వీరమహిళల ఫోన్లు లాక్కొని ఇవ్వకుండా పోలీసులు వేధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆడవాళ్లని కూడా చూడకుండా పోలీసులు ఏవిధంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తే మీకే ఏపీలో వైసీపీ సర్కార్ కు పోలీసులు ఎంతగా దాసోహం అయ్యారో అర్థమవుతుంది. పోలీసుల దమనకాండకు, వైసీపీ సర్కార్ దాష్టీకాలకు త్వరలోనే సమాధానం చెప్పి సమయం దగ్గరలోనే ఉంది.
జనసేన పార్టీకి ఇలాంటి దమ్మున్న వీర మహిళలు ఎంతో అవసరం అని జనసేన పార్టీ ట్వీట్ చేస్తూ కొనియాడుతోంది. మీరు పోరాడుతున్న తీరి ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తుంది కితాబిస్తోంది. మంత్రి గుడివాడ అమర్ నాథ్ నియోజకవర్గంలో జనసేన వీరమహిళలను పోలీసులు అడ్డుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. ‘గుడివాడ అమర్నాథ్ నీకు ముందు ఉంది ముసళ్ల పండగ’ అంటూ వీర మహిళలు తొడగొడుతున్న వీడియో సర్క్యూలేట్ అవుతోంది. జనసైనికుల పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తోంది.