Rajamouli- Kanchana: సీనియర్ నటి కాంచన దర్శకుడు రాజమౌళి మీద అసహనం వ్యక్తం చేశారు. ఆయన తనను అవమానించారని కాంచన వాపోయారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న కాంచన ఈ మేరకు సంచనల కామెంట్స్ చేశారు. బాహుబలి చిత్రంలో ఒక పాత్ర కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. నేను పాత్ర చేయడానికి అంగీకరించాను. రెండు రోజులు మీరు షూటింగ్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. నేను రెమ్యూనరేషన్ రూ. 5 లక్షలు అడిగాను. దానికి రాజమౌళి అంగీకరించలేదు. మీ పాత్రకు అంత ఇవ్వలేము. ఐదు లక్షలు పెద్ద అమౌంట్ అన్నారు.
డబ్బుల కోసం ఆయన నన్ను పక్కన పెట్టేశారు. నన్ను మరలా సంప్రదించలేదు. రాజమౌళికి ఐదు లక్షలు చాలా చిన్న అమౌంట్. ఆయన దగ్గర లేని డబ్బా చెప్పండి. మాకు మాత్రం ఐదు లక్షల పెద్ద అమౌంట్. ఐదు లక్షలు ఇస్తే దేవుడు సేవ చేసుకునేవాళ్లం. తప్పుగా అంటున్నానని అనుకోవద్దు. ఆర్టిస్టుల కష్టాలు ఎవరికి తెలుసు. నా సమకాలీన నటులు చాలా మంది ఉన్నారు. వారు నటించాడని సిద్ధంగా ఉన్నారు. కానీ అవకాశాలు ఇవ్వడం లేదు. కేవలం ఐదు లక్షల కోసం ఆయన నన్ను అవమానించారని.. కాంచన చెప్పుకొచ్చారు.
దర్శకుడు రాజమౌళి మీద కాంచన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. తెలుగు ఫ్యామిలీలో పుట్టిన కాంచన మొదట్లో ఎయిర్ హోస్టెస్ గా చేశారు. మూడు దశాబ్దాల పాటు వివిధ పరిశ్రమల్లో పని చేశారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 150కి పైగా చిత్రాల్లో నటించారు. నిజానికి డబ్బు కోసం తాపత్రయ పడాల్సిన అవసరం ఆమెకు లేదు. చెన్నై నగరంలో కోట్లు విలువ చేసే స్థలాన్ని ఆమె టిటిడి సంస్థకు రాసిచ్చారు.
ఈ ఆస్థి కోసం తండ్రితో ఆమె న్యాయపోరాటం చేశారు. తనకు ఇష్టం లేకుండా ఆస్తిని తన పేర రాయించుకున్నారని ఆమె ఆరోపణలు చేశారు. సుదీర్ఘ పోరాటం అనంతరం ఆస్తులు ఆమెకే తిరిగి దక్కాయి. వాటిని కాంచన దేవస్థానానికి రాసిచ్చారు. చాలా గ్యాప్ అనంతరం కాంచన అర్జున్ రెడ్డి చిత్రంలో నటించారు. హీరో విజయ్ దేవరకొండకు నాన్నమ్మ పాత్ర చేశారు. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మళ్ళీ నటించలేదు. చెప్పాలంటే ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. మరొక విశేషం ఏమిటంటే కాంచన వివాహం చేసుకోలేదు. దేవుని సేవకే జీవితం అంకితం చేశారు.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Rajamouli insulted me for money senior actress kanchana serious allegations
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com