Homeట్రెండింగ్ న్యూస్Prasanna Shanker Narayana: ఎవరీ ప్రసన్న శంకర్ నారాయణ.. ఇతడి వైవాహిక జీవితంపై ఎందుకీ చర్చ..

Prasanna Shanker Narayana: ఎవరీ ప్రసన్న శంకర్ నారాయణ.. ఇతడి వైవాహిక జీవితంపై ఎందుకీ చర్చ..

Prasanna Shanker Narayana: HR టెక్ స్టార్టప్ కంపెనీ అయిన రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడుగా ప్రసన్న శంకర్ నారాయణ ఉన్నారు. సింగపూర్ ప్రాంతానికి చెందిన క్రిప్టో సోషల్ నెట్వర్క్ OxPPL.com వ్యవస్థాపకుడిగా ప్రసన్న శంకర్ నారాయణ వ్యాపార వర్గాల్లో సుపరిచితుడు. ఇతడికి అనేక స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక సామాన్య కుటుంబంలో ప్రసన్న శంకర్ నారాయణ(Prasanna Shankar Narayana) జన్మించారు. అమెరికాలో వ్యాపారవేత్తగా ఎదిగారు.. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడ్డారు.. చివరికి అనుకున్నది సాధించారు.

Also Read: ఢిల్లీ పావురాల్లో కొత్త వైరస్‌.. విజృంభిస్తే మరో కరోనా.. అధికారుల అలర్ట్‌!

వ్యాపార వర్గాల్లో సుపరిచితమైన వ్యక్తిగా పేరుపొందారు. ప్రస్తుతం ప్రసన్న శంకర్ నారాయణ వ్యక్తిగత జీవితం మీడియా, సోషల్ మీడియాలో నానుతోంది.. ప్రసన్న శంకర్ నారాయణ దివ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. అతడి వయసు 9 సంవత్సరాలు. కొంతకాలంగా ప్రసన్న శంకర్ నారాయణ, దివ్య మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. అవి కాస్త చినికి చినికి గాలి వాన లాగా మారాయి. దీంతో ఇప్పుడు వారిద్దరూ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది విషయాన్ని ప్రసన్న శంకర్ నారాయణ తన ట్విట్టర్ ఖాతా ద్వారా బయటి ప్రపంచానికి వెల్లడించారు..” నా భార్య దివ్యకు వివాహేతర సంబంధం ఉంది. దీనిపై అనేక సార్లు గొడవలు జరిగాయి. నేను ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఆమె తన ప్రవర్తనను మార్చుకోవడం లేదు. అందువల్లే విడాకులు దాకా ప్రయాణం సాగించాల్సి వచ్చిందని” ప్రసన్న శంకర్ నారాయణ వ్యాఖ్యానించాడు..” నా భర్త ప్రసన్న శంకర్ నారాయణ స్త్రీ లోలుడు. ఆయనకు ఆ పిచ్చి ఎక్కువ. సీక్రెట్ గా మహిళల వీడియోలు రికార్డు చేస్తాడు.

నా పేరు మీదున్న ఆస్తులను మొత్తం తన పేరు మీదికి బదిలీ చేయించుకున్నాడని” ప్రసన్న శంకర్ నారాయణ భర్త దివ్య ఆరోపించారు. అయితే ప్రసన్న శంకర్ నారాయణ భార్య దివ్య చేసిన ఫిర్యాదు మేరకు సింగపూర్ పోలీసులు దర్యాప్తు చేశారు. దివ్య చేసినట్టుగా ప్రసన్న శంకర్ నారాయణ ఇటువంటి ఆస్తులను తన పేరు మీద బదిలీ చేయించుకోలేదని పేర్కొన్నారు. ఇక ఈ సమయంలో దివ్య చెన్నైకి వచ్చింది.. తన కుమారుడిని ప్రసన్న శంకర్ నారాయణ అపహరించాడని.. చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన ప్రసన్న శంకర్ నారాయణ తన కుమారుడు తన వద్ద ఉన్న వీడియోను బయటికి విడుదల చేశాడు. సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాడు. అంతేకాదు దివ్య తనపై ఫిర్యాదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండాలంటే 25 లక్షలు ఇవ్వాలని చెన్నై పోలీసులు తనను డిమాండ్ చేశారని ప్రసన్న శంకర్ నారాయణ ఆరోపించాడు. అంతే కాదు తనకు అమెరికా, సింగపూర్ న్యాయస్థానాలు ఇచ్చిన క్లీన్ చీట్ కాపీలు, కోర్టు తీర్పుల కాపీని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారం కాస్త చెన్నై పోలీసులను ఇరకాటంలో పడేసింది. పేరుపొందిన వ్యాపారవేత్త కావడంతో తమిళనాడు పోలీసులు కూడా ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు.

సోషల్ మీడియాలో సంచలనం

ఇటీవల భార్యల వేధింపులు తట్టుకోలేక బెంగళూరులో ఓ ఐటీ ఉద్యోగి తనువు చాలించాడు. ఢిల్లీలోను ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇవే కాక ఇంకా చాలా సంఘటనలు చోటు చేసుకోవడంతో #mentoo ఉద్యమం సోషల్ మీడియాలో ఉదృతంగా సాగుతోంది. ఈ క్రమంలో ప్రసన్న శంకర్ నారాయణ ఉదంతం సోషల్ మీడియాకు పాకింది. ట్విట్టర్లో #justiceforprasannaShankarNarayana అనే యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ యాష్ ట్యాగ్ లో వేలాది పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రసన్న శంకర్ నారాయణ ఉదంతం దేశం మొత్తాన్ని ఊపేసేలాగా కనిపిస్తోంది.

Also Read: తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. కలెక్టర్ల సదస్సులో సీఎం సంచలన ప్రకటన!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular