Homeఅంతర్జాతీయంChina: అమ్మాయిల లోదుస్తులతో అబ్బాయిల యాడ్.. ఛీపాడు ఇదేం పని?

China: అమ్మాయిల లోదుస్తులతో అబ్బాయిల యాడ్.. ఛీపాడు ఇదేం పని?

China: చైనా నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. వస్తువుల తయారీ నుంచి వాటి ప్రమోషన్ వరకు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ప్రయోగమే చేశారు. ఆన్‌లైన్‌లో లోదుస్తుల ప్రకటనల్లో మహిళలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనాలోని ఆన్‌లైన్‌ వ్యాపార నిర్వాహకులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మహిళల స్థానంలో పురుష మోడళ్లను ఉంచి ప్రకటనలు చేస్తున్నారు. ప్రచారం కోసం.. ఆన్‌లైన్‌లో లోదుస్తుల ప్రకటనలు చేయకుండా అమ్మాయిలపై చైనా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో […]

China
China

China: చైనా నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. వస్తువుల తయారీ నుంచి వాటి ప్రమోషన్ వరకు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. తాజాగా ఇలాంటి ప్రయోగమే చేశారు. ఆన్‌లైన్‌లో లోదుస్తుల ప్రకటనల్లో మహిళలను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో చైనాలోని ఆన్‌లైన్‌ వ్యాపార నిర్వాహకులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మహిళల స్థానంలో పురుష మోడళ్లను ఉంచి ప్రకటనలు చేస్తున్నారు.

ప్రచారం కోసం..
ఆన్‌లైన్‌లో లోదుస్తుల ప్రకటనలు చేయకుండా అమ్మాయిలపై చైనా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో అక్కడి ఆన్‌లైన్‌ వ్యాపార నిర్వాహకులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ప్రచార వీడియోల్లో అమ్మాయిలకు బదులు, అబ్బాయిలకు లోదుస్తులు ధరింపజేసి చిత్రీకరిస్తున్నారు. ఆ వీడియోలనే ఆన్‌లైన్‌లో పోస్టు చేసి ప్రచారం చేసుకుంటున్నారు.

న్యూయార్క్‌ పోస్టులో కథనం..
లోదుస్తులకు సంబంధించిన ఆన్‌లైన్‌ ప్రకటనల్లో అమ్మాయిలు ఉండటం వల్ల అశ్లీలత పెచ్చుమీరుతోందన్న ఉద్దేశంతో చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. ఎట్టిపరిస్థితుల్లో ఆన్‌లైన్‌ ప్రచారాలకు మహిళలను ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనికోసం ఏకంగా ప్రత్యేక చట్టాన్నే తీసుకొచ్చింది. దీంతో ఆన్‌లైన్‌ వ్యాపార నిర్వాహకులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీనిని అధిగమించేందుకు కొన్ని ఆన్‌లైన్‌ సంస్థలు అమ్మాయిల స్థానంలో అబ్బాయిలను నియమించుకొని వారితో మోడలింగ్‌ చేయించారు. కొంత వరకు ఇది మంచి ఫలితాలనే ఇవ్వడంతో మిగతావారు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. అమ్మాయిల లోదుస్తులు వేసుకున్న పురుష మోడల్స్‌ వీడియోలు ప్రస్తుతం అక్కడి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

China
China

కామెంట్ల వెల్లువ..
తాజా ప్రమోషన్ యాడ్స్ పై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘‘ఒకవేళ ఆ వీడియోలో ఉన్నది మహిళా మోడల్‌ అయితే ఆ సంస్థ పరిస్థితి వేరేలా ఉండేది. తర్వాతి నిమిషంలోనే ఆ సంస్థకు మూత పడేది. అందుకే పురుష మోడళ్లతో వీడియోలు తీస్తోంది’’ అంటూ ఒక యూజర్‌ కామెంట్‌ చేశాడట. ‘ఆ దుస్తులు అమ్మాయిల కంటే.. అబ్బాయిలు వేసుకుంటేనే బాగుంది కదా’ అని మరో యూజర్‌.. షేక్స్‌పియర్‌ కాలంలోనూ వాణిజ్య ప్రకటనల్లో నటించేందుకు మహిళలకు అనుమతించలేదు. అప్పుడు కూడా మగవాళ్లే వారి పాత్రల్లో నటించేవారు’ అని ఇంకో యూజర్‌ కామెంట్‌ చేశాడట.

మొత్తంగా విచిత్ర ఆలోచన.. వెరైటీ ప్రమోషన్ చైనాకే సాధ్యం అవుతుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper